• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుకు బ్యాడ్ టైం......

బాబుకు బ్యాడ్ టైం... పవన్... బాలయ్యలకు....?

| బాబుకు బెయిల్ వస్తుందా రాదా అన్నది ఒక బిగ్ పజిల్ గా మారితే జ్యోతీష్య పండితులు నుంచి వివిధ రంగాల ప్రముఖుల దాకా బాబుకు బ్యాడ్ టైం నడుస్తోంది అని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-25 14:36 GMT

ఏపీ మాజీ సీఎం, జాతీయ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ఇపుడు రాజమండ్రి జైలు గోడల మధ్యన బంధీ అయిపోయారు. ఆయన అసలు కోర్టు మెట్లే ఎక్కరు అనుకుంటే ఏకంగా రిమాండ్ ఖైదీగా మారిపోయారు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారులే అని మొదటి రోజున అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే రెండు వారాలు గడచి మూడవ వారం ప్రవేశించింది. బాబుకు బెయిల్ వస్తుందా రాదా అన్నది ఒక బిగ్ పజిల్ గా మారితే జ్యోతీష్య పండితులు నుంచి వివిధ రంగాల ప్రముఖుల దాకా బాబుకు బ్యాడ్ టైం నడుస్తోంది అని అంటున్నారు.

బాబుకు బ్యాడ్ టైం ఇది. అందుకే ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు అని టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ అన్నారు. ఆయన టాలీవుడ్ లో మిగిలిన హీరోలకు భిన్నగా ఈ రకంగా రియాక్ట్ కావడం విశేషం. బాబు అరెస్ట్ జైలు మీద అన్ని వేళ్లూ జగన్ వైపు చూపించవచ్చు కాక కానీ అది కాదు విషయం అంటూ ఆయన చెప్పినది ఏంటి అంటే బాబుకు బ్యాడ్ టైం నడిస్తే అంతేనని.

బాబు టైం బాగుంటే ఆయనకు లోకల్ కోర్టులోనే అంతా అనుకూలం జరిగేది అని కూడా సుమన్ విశ్లేషించారు. బాబు మాత్రమే కాదు బ్యాడ్ టైం ని ఎవరు అయినా కూడా ఫేస్ చేయాలని సుమన్ అన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అన్నది రాజకీయాలలో ఉన్న వారికి ఒక గుణపాఠం అని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

మరో వైపు చూస్తే ఒక మాజీ సీఎం ని అరెస్ట్ చేయడం చిన్న విషయం కాదని సుమన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినపుడు అన్నీ ఆలోచించే చేసి ఉంటారు అని ఆయన అంటున్నారు. అంటే సీఐడీ చెబుతున్న ఆధారాలు కోర్టులు ఇస్తున్న తీర్పులు చూసిన మీదటనే సుమన్ లాంటి వారు ఈ రకంగా అభిప్రాయానికి వస్తున్నారు అనుకోవాల్సి ఉంటుంది.

సరే సుమన్ జ్యోతీష్కుడు కాదు కానీ ఆయన జరుగుతున్న పరిణామాలను చూసి బ్యాడ్ టైం బాబుకు అని అంచనాకు వచ్చారు. కానీ నిజంగా జాతకం ప్రకారం చూస్తే అష్టాదశ శని బాబుకు ఉందని జ్యోతీష్కులు అంటున్నారు. చంద్రబాబు ఈ టైం లో న్యాయపరంగా ఇబ్బందులు పడతారని వేణు స్వామి సహా చాలా మంది ముందే జాతకం చెప్పేశారు. అదే ఇపుడు నడుస్తోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో చంద్రబాబు జాతకంలో కర్కాటక రాశికి ఈ ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు.

ఇక బాబు వియ్యంకుడు కం బావమరిది బాలయ్య జాతకం చూస్తే ఆయనకు 2025 దాకా మంచి జాతకమే నడుస్తోంది అంటున్నారు. ఆయనకు గజకేసరి యోగం ఉందని కూడా గతంలో జాతకులు చెప్పి ఉన్నారు. దాని ఫలితంగా ఆయనకు ఉన్న రంగంలో అంటే సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. సినీ రంగంలో చూస్తే బాలయ్య సినిమాలు వరస హిట్స్ అవుతున్నాయి. రాజకీయంగా కూడా బాలయ్య చురుకుగా అయ్యారు. మరి ఆ ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

ఇంకో వైపు చూస్తే టీడీపీకి బాబుకు మిత్రుడు అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంటుందంటే ఆయనకు కూడా బాగానే ఉంటుంది అని అంటున్నారు. జాతకులు చెప్పిన మేరకు పవన్ రెండు ఉంగరాలను కూడా ధరించారు. అది కూర్మావతారం ఆకారంలో ఒకటి అయితే నాగబంధంతో మరొకటి. ఈ రెండూ కూడా పవన్ కి కింగ్ మేకర్ లేదా కింగ్ గా మారుస్తాయని అంటున్నారు.

టోటల్ గా చెప్పుకోవాలీ అంటే టీడీపీ జనసేన కూటమిలో బాబు కు బ్యాడ్ టైం నడుస్తూంటే బాలయ్య, పవన్ జాతకాలు బాగున్నాయని అంటున్నారు. మరి ఏపీ రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అన్నది 2024 ఎన్నికల ఫలితాలను చూస్తేనే ఎవరైనా చెప్పాలి. ఏది ఏమైనా ముమ్మారు రాజయోగం కలిగి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న చంద్రబాబు నాలుగవ సారి సీఎం అయితే మాత్రం అది సరికొత్త చరిత్రే అని కూడా అంటున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Politicalnews 
  • Chandrababunaid 
  • Cbnarrest 
  • Cbnjail 
  • Horoscope 
  • Balakrishna 
  • Pawankalyan 
  • Astrology 

Similar News

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS