• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'అరుంధతి' అఘోర సీన్ పై...

'అరుంధతి' అఘోర సీన్ పై ఉజ్జయిని మహంకాళి పూజారి షాకింగ్ కామెంట్!

| స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అరుంధతి సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By - Madhu Reddy
Update: 2026-08-04 05:57 GMT

స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2009లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అరుంధతి సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అనుష్క, సోనుసూద్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఏకంగా ఏడు విభాగాలలో రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారాలను సొంతం చేసుకుంది. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో చింతపల్లి రమణ అందించిన స్టోరీ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా గురించి.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల.. ఆ చెడు ప్రభావం తనపై పడింది అంటూ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

అరుంధతిలో నటించింది నిజమైన అఘోరాలా?

పశుపతిని అంతం చేయాలి అంటే.. జేజమ్మ ప్రాణార్పణ చేయాలి అని అఘోరాలు చెబుతారు. దీంతో ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. అఘోరాల వద్దకు వచ్చి భరించలేని, బాధాకరమైన చావును ఇవ్వమని వారిని అడుగుతుంది. తాను పడబోయే నరకయాతన పశుపతి ప్రేతాత్మ మీద తన ప్రతీకారపు వాంఛను రగిలేలా చేయాలని కోరుతుంది. ఆ సమయంలో అఘోరాలు ఆమె తల మీద కొబ్బరికాయలు పగలగొడతారు . ఆమె శవాన్ని కొయ్యపై కాల్చి అఘోరాలు ఆమె ఎముకలతో శక్తివంతమైన ఆయుధాన్ని సృష్టించే సన్నివేశం సినిమాకే హైలెట్ ఆ సీన్ చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

అరుంధతి చెడు ప్రభావం వల్లే నాకు క్యాన్సర్స్ అవుతుంది - ప్రధాన పూజారి

అయితే ఇక్కడ కనిపించింది నిజమైన అఘోరాలని , తాజాగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి వేణుమాధవ్ శర్మ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నటించిన కొన్ని రోజులకే నాకు క్యాన్సర్ సోకింది. ఆ సీన్లలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ప్రభావం వల్లే నాకు ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చిందని నేను నమ్ముతున్నాను. వైద్యుల చికిత్స తో పాటు నేను నిత్యం కొలిచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం దైవ శక్తి వల్లే నేను మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకొని ప్రాణాలతో బయటపడ్డాను. సినిమా గ్లామర్ వెనుక ఇలాంటి నమ్మలేని దైవిక అనుభవాలు కూడా ఉంటాయని కచ్చితంగా నేను చెప్పగలను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా అమ్మవారి లీలలు నిజంగా అపరిమితం అంటూ వేణుమాధవ్ శర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

అందుకే కోడి రామకృష్ణ చేతులకు దారాలు కట్టుకున్నారా?

ఉజ్జయిని మహంకాళి దేవాలయ ప్రధాన పూజారి వేణుమాధవ్ శర్మ చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఎందుకు తన చేతులకు దారాలు, తలకు పాగా కట్టుకున్నారో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన ఇలాంటి చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించారు. కాబట్టే వాటి తాలూకా చెడు ప్రభావం తనపై పడకుండా కొంతమంది పూజారుల చేత ఆయన ప్రత్యేకించి ఇలా తాళ్ళను కట్టించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ప్రధాన పూజారి చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే ఆ మాటలు నిజమే అని అందరూ నిర్ధారణకు వస్తున్నారు. ఏది ఏమైనా సినిమాలు కూడా నిజ జీవితంలో ఇలాంటి ఘటనలకు దారితీస్తాయా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • arundhati 
  • anushka 
  • kodiramakrishna 
  • venumadhavsharma 
  • aghora 
  • telugucinema 
  • tollywood 
  • sonusood 
  • ujjayinimahankali 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS