• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఐపీఎల్‌ లో ఏపీ జట్టు...

ఐపీఎల్‌ లో ఏపీ జట్టు విషయంలో జగన్ దూకుడు!

| ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టును ఐపీఎల్‌ లో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని..

By - Tupaki Desk
Update: 2023-07-16 11:30 GMT

క్రికెట్ ను మతంగా భావించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని అంటారు. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశస్తులతో సైతం ఈ మాట చెప్పించుకోగలుగుతున్నారంటే... భారత్ లో క్రికెట్ స్థాయి స్థానం ఆ స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో ఐపీఎల్ లో ఏపీ టీం విషయంలో ఒక అప్డేట్ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.

అవును... ఏమాత్రం పరిచయం అవసరంలేని టోర్నమెంట్స్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లెవెలే వేరని అంటుంటారు. ఇందులో భాగంగా... ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ కోసం అటు క్రీడాకారులు, ఇటు క్రీడాభిమానులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఈ సమయంలో ఐపీఎల్ లో ఏపీ టీం విషయంలో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఐపీఎల్ లో సన్‌ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అనే పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. వీటి సరసన ఏపీ టీం కూడా చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ను జగన్ ఆదేశించినట్లు సమాచారం.

ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టును ఐపీఎల్‌ లో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ఈ మేరకు రోడ్‌ మ్యాప్‌ ను సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీల కోసం విండోను తెరిస్తే.. కొత్త ఫ్రాంచైజీని బిడ్డింగ్ ద్వారా స్వంతం చేసుకోవాలి. దీనికోసం ఇప్పటికే పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఏసీఏ చర్చలు జరుపుతోందని అంటున్నారు.

విషయంలో జగన్ సూచనల మేరకు ఐపీఎల్‌ లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టును పొందేందుకు ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇందులో భాగంగా... ఐపీఎల్‌ లో ఏపీ జట్టు ఫ్రాంచైజీని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ జట్టును సొంతం చేసుకునేందుకు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో మాట్లాడుతోందని అంటున్నారు. ఏది ఏమైనా... రాబోయే రోజుల్లో ఐపీఎల్ లో ఏపీ టీం సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది.

Tags:    
  • AndhraPradesh 
  • IPL 
  • AndhraPradeshTeam 
  • IndianPremierLeague 
  • SunRisersHyderabad 
  • CSK 
  • RCB 
  • GT 
  • MI 
  • RR 
  • LSG 
  • KKR 
  • YsJaganMohanReddy 
  • PoliticalNews 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS