పుష్ప 2 vs ఓజీ.. ఢీ అంటే ఢీ
గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచింది.;
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా టికెట్ల రేట్ల పెంపుపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. అంత భారీ బడ్జెట్ సినిమా అయిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’కు నాడు ధరలను బట్టి రూ.800 వరకూ టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. దీన్ని అల్లు అర్జున్ తోపాటు సినీ పరిశ్రమ కూడా హర్షించింది. అయితే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా పవన్ నటించిన ‘ఓజీ’కి రూ.1000 వరకూ టికెట్ పెంచారు. దీన్నే వైసీపీ లాజిక్ తో ప్రశ్నిస్తోంది.. అంతటి భారీ బడ్జెట్ మూవీ పుష్ప2కే 800 పెంచితే.. దాంతోపోల్చితే తక్కువ బడ్జెట్ అయిన ఓజీకి రూ.1000 పెంచడం ఏంటని వైసీపీ శ్రేణుల సోషల్ మీడియాలో నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి ధరలతో పోలిస్తే ఇది సరైన రేటు అని పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఈ పుష్ప 2 వర్సెస్ ఓజీ మధ్య ఢీ అంటే ఢీ అనేలా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.
‘ఓజీ’ టికెట్ల రేట్లపై వైసీపీ ఫైర్
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’కి టికెట్ రేట్లు భారీగా పెంచడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీతో కలిపి) వసూలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అధిక రేట్లు సాధారణ ప్రేక్షకులకు భారంగా మారుతాయని, ఇది రాజకీయ హోదాకు తగదని వాదిస్తున్నారు.
‘పుష్ప 2’ vs ఓజీ.. పై సోషల్ ఫైట్?
గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచింది. అప్పటి ధరలకు అనుగుణంగా రూ.800 భారీ రేటుకు పెంచుకునే వీలు కల్పించింది. దీనిపై బన్నీ అభిమానులు కూడా స్వాగతించారు. సినీ పరిశ్రమ తరుఫున ఏపీ ప్రభుత్వానికి .. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. సినిమా దేశవ్యాప్తంగా విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ సినిమా బడ్జెట్ కు అనుగుణంగా రేట్లు పెంపులకు న్యాయం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ అభిమానులు, ‘ఓజీ’ విషయంలో పుష్ప2 ను మించి అధిక ధరలు పెట్టడంపై నిలదీస్తున్నారు. పుష్ప 2 కంటే తక్కువ బడ్జెట్ మూవీకి రూ.1000 టికెట్ పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే దీనికి పవన్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. “అప్పుడు ‘పుష్ప 2’కి కూడా రూ.800 (జీఎస్టీతో కలిపి) ధరలు పెంచారు. అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? ఇప్పటి ధరల ప్రకారం రూ.1000 పెంచడంలో తప్పులేదు” అని పవన్ అభిమానులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ స్వలాభం కోసం నడుస్తున్న నాటకమని పవన్ అభిమానులు అంటున్నారు.
*అభిమానుల మధ్య ఢీ అంటే ఢీ
ఈ టికెట్ల ధరల వివాదం ఇప్పుడు కేవలం సినిమా టికెట్లకే పరిమితం కాకుండా, రాజకీయ పార్టీల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద రగడకు దారితీసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, వైసీపీ అభిమానులు సినిమాలకు టికెట్ ధరలపై సోషల్ మీడియాలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోస్టులు పెట్టుకుంటున్నారు. ఈ వివాదం చూస్తున్న సామాన్య ప్రేక్షకులు మాత్రం “ఇంత ఖరీదైన టికెట్లు ఎవరు కొంటారు?” అని ఆశ్చర్యపోతున్నారు.
ఈ మొత్తం వివాదం కేవలం సినిమా క్రేజ్‌కు సంబంధించినదా? లేక రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి చేస్తున్న ప్రయత్నమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ పోరులో సినిమా ప్రేక్షకులపై పడే భారం ఎంత? అనేదే ప్రధాన ప్రశ్న.