కూటమి సర్కారు ‘స్త్రీశక్తి’ పథకం ఎలా అమలు కానుంది?
ఈ రెండు ఇష్యూలను తీర్చే విషయంలో ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు (కర్ణాటక, తెలంగాణ) కిందా మీదా పడుతున్నాయి.;
ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరి ఏడాది దాటి పోయింది. ఎన్నికల వేళ.. తమ ప్లాగ్ షిప్ ప్రోగ్రాంలుగా చెప్పుకున్న వాటిల్లో ఒకటి కర్ణాటక.. తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఒకటి. మిగిలిన పథకాలకు భిన్నంగా దీని అమలుకు రెండు విరుద్ధ వాదనలు ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నాయి. అందులో ఒకటి.. ఉచిత బస్సు ప్రయాణం అన్నంతనే.. భారీ ఎత్తున వస్తున్న మహిళా ప్రయాణికుల అవసరాల్ని తీర్చటంలో కిందా మీదా పడటం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తమ కడుపు మీద కొడుతుందంటూ ఆటో డ్రైవర్లు హాహాకారాలు చేయటం చూస్తున్నదే.
ఈ రెండు ఇష్యూలను తీర్చే విషయంలో ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు (కర్ణాటక, తెలంగాణ) కిందా మీదా పడుతున్నాయి. దీంతో.. ఈ రాష్ట్రాల అనుభవాల్ని పాఠాలుగా మార్చుకొని ఆచితూచి అన్నట్లుగా ఈ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు నేత్రత్వంలోని కూటమి సర్కారు భావిస్తోంది. ఈ కారణంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించటం తెలిసిందే.అదే సమయంలో ఏపీ సర్కారుకు మాత్రం ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకోవటం గమనార్హం.
ఈ పంద్రాగస్టు రోజున ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని సీఎం చంద్రబాబు డిసైడ్ చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై భారీ ఎత్తున చర్చలు జరిగాయి. ఈ పథకం పేరును ‘స్త్రీశక్తి’గా డిసైడ్ చేయటం.. ఈ పేరు మీదే ప్రచారం చేయాలని నిర్ణయించారు.తాజాగా.. ఈ పథకం అమలు ఎలా ఉంటుందన్న దానిపై వివరాలు వెల్లడయ్యాయి. దీనికి ముందు పరిమితంగానే ఈ పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ పథకం అమలుపై కూటమి సర్కారు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఈ పథకానికి కొన్ని పరిమితులు విధించాలని ప్రభుత్వం భావించినట్లుగా చెప్పినప్పటికీ..దీనిపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ పథకం అమలు ఎలా సాగుతుందన్నది ఆశ్చర్యకరంగా మారింది. ఈ కన్ఫ్యూజ్ కు చెక్ చెబుతూ తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల్ని సిద్ధం చేశారు. అందులోని ముఖ్యమైన పాయింట్లను చూస్తే..
- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏపీ మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించొచ్చు.
- పల్లెవెలుగు.. అల్ట్రా పల్లెవెలుగు.. ఎక్స్ ప్రెస్.. మెట్రో ఎక్స్ ప్రెస్.. సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
- 6700 బస్సుల్లో మహిళలకు ఫ్రీగా జర్నీ.
- మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కోసం రూ.1950 కోట్ల వ్యయం
- మహిళలు ఆధార్.. ఓటర్ ఐడీ.. రేషన్ కార్డు.. ఇలా ఏదో ఒక ఫ్రూప్ చూపించాల్సి ఉంటుంది.