• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాడు సస్పెండ్ చేశారు.....

నాడు సస్పెండ్ చేశారు.. నేడు దండలేసి ఆహ్వానిస్తున్నారు! స్థానిక రాజకీయంలో తిరగబడ్డ సీన్

| ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్లు దక్కక రెబల్స్‌గా పోటీ చేసిన దాదాపు 100 మంది విజయం సాధించినట్లు తెలుస్తోంది. దీంతో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల్లో వీరి మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెబల్స్ ఎక్కువగా గెలవడంతో కూటమి, వైసీపీ నేతలు వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో రానున్న ఎంపీపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

By - Tupaki Political Desk
Update: 2026-11-08 13:30 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలే కాదు, ఆ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు చేసిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో గెలుపొందారు. పార్టీని నమ్ముకున్నా ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చారనే ఆగ్రహంతో చాలా మంది నేతలు రెబల్స్ గా పోటీకి దిగారు. ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వంద మంది వరకు రెబల్స్ అభ్యర్థులు విజయం సాధించడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా చాలా మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన రెబల్స్ మద్దతు కీలకం కానుందని చెబుతున్నారు. దీంతో వారిని మచ్చిక చేసుకోడానికి కూటమి పార్టీలు ప్రయత్నాలు మొదలు అయ్యాయని అంటున్నారు. అయితే ఎన్నికల్లో టికెట్లే ఇవ్వని పార్టీలను ముప్పుతిప్పలు పెట్టేలా ఇప్పుడు రెబల్స్ డిమాండ్లు వినిపిస్తున్నారని, దీంతో బడా నేతలు సైతం దిక్కులు చూస్తున్నారని చెబుతున్నారు.

గతంలో టికెట్లు నిరాకరించిన నాయకులు ఇప్పుడు విజేతలుగా నిలవడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు వద్దన్నవారే ఇప్పుడు అవసరమయ్యారంటూ పార్టీల ముఖ్య నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను మచ్చిక చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల్లో టికెట్లు నిరాకరించడంతో రెబల్స్ గా పోటీ చేసి గెలిచిన స్వతంత్రుల మద్దతు ఎంపీపీలను ఎన్నుకోవడంలో కీలకంగా చెబుతున్నారు. దీంతో వారిని మచ్చిక చేసుకోడానికి కూటమితోపాటు ప్రతిపక్ష వైసీపీ కూడా రంగంలోకి దిగింది. స్వతంత్రులను ఆకర్షించి ఆయా మండల పీఠాలను తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో తమను కాదన్న నేతలకు ఇప్పుడు రెబల్స్ చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారని ఎన్నికల సమయంలో తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, తమకున్న ప్రజాబలంతో నెగ్గితే ఇప్పుడు వచ్చి తిరిగి పార్టీలోకి రమ్మంటున్నారంటూ పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా గెలిచిన వారి నిర్ణయాలు కీలకం కావడంతో నేతలు వారిని బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో స్వతంత్రులు ప్రధాన పార్టీల తలరాతను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 16 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట, జలదంకి, ఆత్మకూరు, వెంకటాచలం మండలాల్లో గెలిచిన 6 స్థానాలు తెదేపా రెబల్స్ సాధించినవే. కడప జిల్లా రాజంపేట, కలశపాడు, సుండుపల్లి, బద్వేలు మండలాల్లోని 9 ఎంపీటీసీ స్థానాల్లోనూ రెబల్స్ హవా నడిచింది. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, యాదగిరి మండలాల్లో తెదేపా రెబల్స్ గెలవగా, ఎస్‌ఆర్‌ పురం మండలంలో జనసేన రెబల్ విజయం సాధించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఒక స్థానంలో తెదేపా రెబల్‌ విజయం సాధించి అక్కడి ఎంపీపీ ఎన్నికను ఆసక్తికరంగా మార్చేశారని చెబుతున్నారు. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, పల్నాడు వంటి ఇతర జిల్లాల్లోనూ స్వతంత్రులు గణనీయంగా పుంజుకుని ప్రధాన పార్టీల లెక్కలను తారుమారు చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి గెలిచిన వారే కావడం గమనార్హం.

మరోవైపు మండల పరిషత్ ఎన్నికలకు సమయం ఉండటంతో రెబల్స్ చుట్టూ రాజకీయం మరింత ఉత్కంఠకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. కొన్నిచోట్ల అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీలకు సమానంగా ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. దీంతో రెబల్స్ కింగ్ మేకర్స్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలకు నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా రెండు పార్టీల వారు తమ వారిని క్యాంపులకు తరలిస్తుండటంతో రెబల్స్ కు డిమాండ్ పెరిగింది. రెబల్స్ ను తమ వైపు తిప్పుకుని మండల పీఠాలు తన్నుకుపోవాలనే ఆలోచనతో రెండు పార్టీలు జోరుగా పావులు కదుపుతున్నాయి. దీంతో రానున్న కొద్దిరోజులు రెబల్స్ నిర్ణయాలు రాజకీయంగా హీటెక్కించనున్నాయని చెబుతున్నారు.

Tags:    
  • andhrapradesh 
  • ap politics 
  • mptcelections 
  • zptcelections 
  • rebelcandidates 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS