ఓ మంత్రి క‌థ‌: ఏం చేస్తున్నారంటే!

పోనీ.. వైసీపీ వంటి ప్ర‌తిప‌క్షాలు.. మంత్రుల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం.. విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చేస్తే.. పెద్ద గా ప‌ట్టించుకునే వారు కాదు.;

Update: 2025-08-09 03:30 GMT

``ఏపీలో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క స్టోరీ ఉంది.`` ఇది వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట కాదు. పార్ల మెంటు లాబీల్లో తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్ల‌మెంటు స‌భ్యులు చ‌ర్చించుకున్న‌ప్పుడు వారి మాటల మ‌ధ్య వినిపించిన మాట‌. గ‌త ఏడాది సమ‌యంలో కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. త‌ర్వాత‌.. మంత్రులు ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వారు అడుగులు వేస్తున్నారు. పైకి అంతా బాగానే ఉంద‌ని చెబుతున్నా.. అంత‌ర్గ తంగా మంత్రుల వైఖ‌రి విమ‌ర్శ‌ల‌కు.. ప్ర‌శ్న‌ల‌కు కూడా దారితీస్తోంది.

పోనీ.. వైసీపీ వంటి ప్ర‌తిప‌క్షాలు.. మంత్రుల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం.. విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చేస్తే.. పెద్ద గా ప‌ట్టించుకునే వారు కాదు. కానీ, సాక్షాత్తూ.. ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారో.. వారిలో కొంద‌రిని ముఖ్య మంత్రి చంద్ర‌బాబు ప‌దే ప‌దే అదే ప‌నిగా హెచ్చ‌రిస్తుండ‌డంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల‌కు కూడా.. ఏపీ మంత్రుల వ్య‌వ‌హారం.. పెద్ద చ‌ర్చ‌గా మారింది. ఏపీలోని రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ మంత్రి.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో దున్నేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. భారీ ఎత్తున వెంచ‌ర్లు వేస్తున్నారు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ఏపీని డెవ‌ల‌ప్ చేయాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, స‌ద‌రు మంత్రి వ‌ర్యులు మాత్రం హైద‌రాబాద్ శివారులో ప్ర‌స్తుతం డెవ‌ల‌ప్ అవుతున్న ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ వెంచ ర్లు వేశారు. స‌రే.. మంత్రి వ్యాపారం మంత్రిది అనుకోవ‌చ్చు. కానీ.. దీనికి ఏపీలో ఉన్న ఉచిత ఇసుక‌ను ఆబ‌గా త‌ర‌లించేస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇది.. ఏపీకంటే కూడా తెలంగాణ‌లోని నాయ‌కుల‌కు కంట‌గింపుగా మారింది. తెలంగాణ‌లో ఒక్కొక్క లారీ ఇసుక‌ను 20 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

కానీ, ఏపీకి చెందిన మంత్రి.. ఫ్రీ పేరుతో ఇసుక‌ను రేయింబ‌వ‌ళ్లు త‌ర‌లిస్తున్నారు. ఇక‌, స‌రిహ‌ద్దు ప్రాంతా ల్లోని మ‌ద్యం దుకాణాల‌ను కూడా స‌ద‌రు మంత్రి వ‌ర్యులు ద‌క్కించుకున్న‌ట్టు తెలంగాణ‌లో చ‌ర్చ సాగు తోంది. ఏపీలో వ్యాపారం అయితే.. ఓకే అనుకోవ‌చ్చు. కానీ, తెలంగాణ‌లోని మ‌ద్యం దుకాణాల‌ను కూడా మంత్రి ద‌క్కించుకుని.. రెండు చేత‌లా సంపాయిస్తున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ మంత్రి.. తొలిసారి చంద్ర‌బాబు టీంలో చేరారు. కానీ, సీనియ‌ర్ నాయ‌కుడు. ఇరు రాష్ట్రాల్లో కూడా మంచి ప‌లుకుబ‌డి ఉంది. దీంతో ఆయ‌న‌కు తిరుగులేకుండా పోయింద‌ని అంటున్నారు. ఇదీ.. సంగ‌తి!.

Tags:    

Similar News