జంక్షన్ లో బిక్షగాళ్ళు... సవాల్ చేస్తున్నారు !
వృత్తులు అనేక రకాలు. పొట్ట కూటి కోసం కోటి విద్యలు అని అంటారు. ఆఖరులు దొంగతనాన్ని కూడా ఒక వృత్తిగా చెబుతారు.;
వృత్తులు అనేక రకాలు. పొట్ట కూటి కోసం కోటి విద్యలు అని అంటారు. ఆఖరులు దొంగతనాన్ని కూడా ఒక వృత్తిగా చెబుతారు. మరి అందులో భిక్షమెత్తడం వృత్తిగా ఉందో కళగా ఉందో తెలియదు. నిజానికి బిక్షగాళ్ళను చూస్తే అంతా జాలి పడతారు. అయ్యో అడుక్కుంటున్నారే వారికి పాపం ఏమీ లేదే అని మనసు కరిగిపోయి చిల్లర వేస్తారు. వారి ఆకలి బాధ ఎంతో కొంత తీర్చిన వారం అవుతాం కదా అని కూడా మంచి మనసు చూపిస్తారు. అయితే బిక్షగాళ్ళు అందరూ అలాగే ఉన్నారా అంటే కాదు అని చెప్పాల్సిందే. పొట్ట కూటి కోసం అడుక్కునే వారు కొందరు అయితే దీనిని ఒక వృత్తిగా మార్చుకుని హాయిగా కులాసాగా బతికే వారు చాలా మంది ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే బిక్షగాళ్ళను నడిపించే దందాలు ఉన్నాయి అంటారు.
బిక్షగాళ్ళు ఉండరాదు :
ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. బిక్షగాళ్ళు లేకుండా చూడాలని ఒక ఉత్తర్వుని తీసుకుని వచ్చింది మహా నగరాలలో బిక్షగాళ్ళు అధికంగా ఉంటున్నారు. అంతే కాదు ప్రతీ జంక్షన్లో వారి బెడద ఎక్కువగా ఉంటోంది. ఆగిన ప్రతీ వాహనం దగ్గరకు వచ్చి మరీ విసిగించి చిల్లర వేయించుకుంటున్నారు. విశాఖ లాంటి నగరాలలో అయితే బిక్షగాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. పెద్ద సిటీలు కీలక పట్టణాల్లో బిక్షగాళ్ళు అంతకంతకు పెరిగిపోతున్నారు. వీరి విషయంలో ఏమి చేయాలన్న దాని మీద కూటమి ప్రభుత్వం కసరత్తు చేసి మరీ ఈ ఉత్తర్వు జారీ చేసింది.
కనిపిస్తే అలా :
బిక్షగాళ్ళు కనిపిస్తే వారి బంధువుల దగ్గరకు వివరాలు కనుక్కొని పనంపించడం, అలా కుదరకపోతే వారిని అనాధ ఆశ్రమాలలో దింపడం చేసేలా ప్రభుత్వం చర్యలకు దిగబోతోంది, ఇప్పటికే విశాఖ లాంటి చోట్ల బిక్షగాళ్ళు కనిపించకుండా చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. విశాఖ ఇపుడు అంతర్జాతీయ నగరంగా ఉంది. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుకు విశాఖ వేదికగా మారింది. దీంతో ఈ నగరానికి ఎంతో మంది ప్రముఖులు వీవీఅపీలు వస్తున్నారు. వారి ముందు విశాఖ పరువుతో పాటు రాష్ట్రం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా బిక్షగాళ్ళు కనిపిస్తే అది ఇబ్బంది అవుతునందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వారిని ఆ వృత్తి నుంచి దూరం చేయాలని అందరితో పాటుగా వారి పేదరికం తీర్చేందుకు పధకాలు అందచేసి జన జీవన స్రవంతిలోకి తీసుకుని రావాలని అనుకుంటోంది.
టఫ్ టాస్క్ గానే :
ప్రభుత్వం అయితే పేదల కోసం ఎన్నో పధకాలు అమలు చేస్తోంది. పీ 4 పధకం అందులో భాగమే. పేదలను ఒక స్థాయికి తీసుకుని వచ్చేందుకు డబ్బున్న వారిని దత్తత తీసుకోమని ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. దానికి మంచి స్పందన కూడా లభించింది. అయితే ఇపుడు బిచ్చగాళ్ళ విషయంలో కూడా కఠినంగా ఉంటూ వారిని ఒక దారికి తేవాలని ఏపీలో బిక్షగాళ్ళు లేని పరిస్థితిని చూడాలని అనుకుంటోంది. కానీ ఆచరణలో ఇది టఫ్ జాబ్ అని అంటున్నారు. ఎందుకంటే బంగారం చేతికి ఇచ్చినా దానిని తన మూటలో కట్టుకుని తిరిగి బిచ్చమెత్తుకోవడానికే బిక్షగాడు చూస్తారు అని అంటున్నారు
వ్యసనంగా అలవాటుగా :
అది వారికి ఒక వ్యసనంగా అలవాటుగా మారింది అని అంటున్నారు. ఇక బిక్షగాళ్ళను వెనక నుంచి నడిపే దందాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వారే ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అన్నది కూడా ఉంది. ఇలా లోతుగా ఎంతో మూలాల్లోకి అల్లుకునిపోయిన ఈ బిక్షాన్ని నిర్మూలించడం కష్టసాధ్యమే అని అంటున్నారు. వీరిని దూరంగా ఎక్కడికి పంపించిన తిరిగి తమ చోటు వెతుక్కుని అక్కడికే వచ్చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా బిక్షగాళ్ళు లేని సమాజం అందరి కోరిక అది నెరవేరాలని కోరుకోవాల్సిందే.