ఖజానా నో పర్మిషన్ : పథకాల మీద హాట్ డిస్కషన్
ఏపీలో ఖజానా తీరు చూస్తే పధకాలకు నో పర్మిషన్ అంటోంది. నిజానికి చూస్తే ఏపీ గత ఏడాదిగా గాడిలో పడే ప్రయత్నంలోనే ఉంది.;
ఏపీలో ఖజానా తీరు చూస్తే పధకాలకు నో పర్మిషన్ అంటోంది. నిజానికి చూస్తే ఏపీ గత ఏడాదిగా గాడిలో పడే ప్రయత్నంలోనే ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా ఆశించిన ఫలితాలు అయితే రావడం లేదు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా లక్షన్నర కోట్ల రూపాయల అప్పుని ఈ ఏడాది కాలంలో తెచ్చారా లేదా అంటే అప్పులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగానే చేస్తున్నారు.
ఒక వైపు చూస్తే జీఎస్టీ ఆదాయం తగ్గింది. ప్రత్యేకించి ఒక సిటీ నుంచి ఆదాయం వచ్చే ఛాన్సే లేదు ఏపీలో విశాఖ విజయవాడ తిరుపతి వంటివి తప్పించి మిగిలిన చోట్ల టైర్ టూ సిటీస్ నుంచి ఆదాయాన్ని ఎవరూ ఆశించలేరు.
ఇక ఏపీ బడ్జెట్ చూస్తే భారీగానే ఉంది. కానీ జనాల నుంచి పన్నుల రూపంలో ఆదాయం రావాలి. అలాగే కేంద్ర సాయం దక్కాలి. ఇలా అనేక అంచనాల్లో బడ్జెట్ ఉంది. ఇక ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా చెప్పిన మాటలు చూస్తే ఇబ్బంది ఒక రేంజిలోనే ఉంది అని అర్ధం అవుతోంది. పది లక్షల కోట్ల అప్పులు వాటికి కట్టే వడ్డీలతోనే బడ్జెట్ లో ఎక్కువ మొత్తం పోతోందిట.
అంతే కాదు ఇక ఎన్ని అప్పులు తెచ్చినా పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే పోతోంది అని ఆయన వేడి నిట్టూర్పు విడించారు. అంతే కాదు వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు అలాగే ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకే సరిపోతోంది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో జూన్ నెల అంటే కూటమి ప్రభుత్వానికే ఈసారి అతి పెద్ద సవాల్ గా మారింది అని అంటున్నారు. ప్రభుత్వం అయితే రెండు సంక్షేమ పధకాలను అమలు చేయాలని చూస్తోంది. అందులో తల్లికి వందనం పధకం ఒకటి ఉంది. అలాగే అన్న దాతా సుఖీభవ పేరుతో మరో పధకం ఉంది.
ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ తో ఉన్నవే అని చెబుతున్నారు. ఎన్ని నిబంధనలు పెట్టినా మరెన్ని సవరణలు చేసినా కూడా ఈ పధకం కింద లబ్దిదారులు పెద్ద ఎత్తున ఉంటారు అని అంటున్నారు. ఒకసారి కనుక పధకాలను మొదలెడితే మధ్యలో ఆపడం కష్టం ఆపితే మాత్రం జనాల నుంచి నిరసన వస్తుంది. అలాగే విపక్షాలకు అది అతి పెద్ద ఆయుధం గా కూడా మారుతుంది.
దాంతోనే కూటమి పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. పధకాలు ఆలస్యం కావడానికి నిధుల లేమి కారణం అని అంటున్నా జనాలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు అన్నదే ఇక్కడ పాయింట్. ఈ ఏడాదే కాదు రానున్న నాలుగేళ్ళలో కూడా ఏపీ ఆదాయం అయితే గొప్పగా పెరిగిపోయేది ఏమీ లేదు.
కానీ నాలుగేళ్ళ పాటు పధకాలు అన్నీ అమలు చేయడం కత్తి మీద సాము అంటున్నారు. ఇక నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు అన్నారు ఆ పధకం అయితే ఇప్పట్లో ఇచ్చేది ఉండదు అంటున్నారు. అలాగే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఇచ్చే నెలకు 1500 రూపాయలు స్కీం కూడా స్కిప్ చేయాల్సిందే అంటున్నారు.
ఇలా చాలానే మార్పులు చేసుకుంటూ పధకాల విషయంలో కూటమి పెద్దలు కిందా పైనా పడుతున్నారు. ఏది ఏమైనా హామీలను నెరవేర్చకపోతే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. అమలు చేయాలంటే ఇంతకు ఇంతా అప్పులు చేయాలి. అయినా అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. సో చూడాలి ఏమి జరుగుతుందో అని అంతా అంటున్నారు.