అప్పుడు దాదాగిరి....ఇప్పుడు నాయుడుగిరి

ఏపీలో నాయుడు గిరీ నడుస్తోంది అన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ని పొగుడుతూ అన్న మాట.;

Update: 2025-12-18 20:30 GMT

ఏపీలో నాయుడు గిరీ నడుస్తోంది అన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు ని పొగుడుతూ అన్న మాట. ఏపీలో ఒకప్పుడు దాదాగిరి సాగింది అని గత ప్రభుత్వం మీద ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే ఇపుడు మాత్రం ఏపీ అభివృద్ధి మంత్రంగా నాయుడు గిరి మారింది అని ఆయన కితాబు ఇచ్చారు.

బాబుకు అవార్డుతో :

ఇదంతా ఎందుకు అంటే ఏపీ సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ అవార్డు రావడంపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ వంటి వారు మాట్లాడుతూ ఆయన ఏపీకి అందించిన సేవలను కొనియాడారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని గుర్తు చేశారు. ఎకనామిక్ టైమ్స్ తమ పత్రికలో పేర్కొన్న హెడ్డింగ్ చదివితేనే గూస్‌బంప్స్ వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అది కూడా ఏపీ సీఎం కి చంద్రబాబుకు రావడం అంటే గ్రేట్ అని అన్నారు.

నాడు ఏపీలో :

ఇదే సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఈ రాష్ట్రం దాదాగిరిని చూసిందిని పయ్యావుల చెబుతూ అభివృద్ధికి రాష్ట్రం పూర్తిగా దూరమైందని అన్నార్. అయితే అదే ఏపీ ఇప్పుడు నాయుడు గిరిని చూస్తోందని అందుకే అభివృద్ధి వైపు వేగంగా పరుగులు పెడుతోందని చెప్పుకొచ్చారు. ఏ రంగంలో అయినా సంస్కరణలు చేపట్టాలంటే అసాధారణ ధైర్యం అవసరం ఉంటుందని చెప్పారు. అయితే అలాంటి ధైర్యం టన్నుల కొద్ది సీఎం చంద్రబాబుకు ఉందని ఆయన అన్నారు. టీడీపీ. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటివరకూ చూసుకుంటే ఏకంగా పాతిక దాకా కొత్త పాలసీలను ప్రవేశపెట్టిందని పయ్యావుల చెప్పారు.

బాబు సీక్రెట్ :

ఇక చంద్రబాబు గురించి ఆయన చెబుతూ ప్రతి రోజూ కొత్తగా ఆలోచించాలని సీఎం చంద్రబబౌ ప్రేరణ ఇస్తుంటారని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక జనరేషన్ గురించి చలా ముందే ఆలోచిస్తారని కొనియాడారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను తొలిసారిగా స్వీకరించిన రాష్ట్రంగా అప్పట్లో ఏపీని నిలిపిన ఘనత సైతం చంద్రబాబుదే అని మంత్రి గుర్తు చేసారు. అంతే కాదు విద్యుత్ రంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబే అన్నారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ గుర్తింపు కోసం కాకుండా ప్రజల సంతృప్తి కోసమే పని చేస్తారని అన్నారు. అటువంటి చంద్రబాబుకు దేశంలో అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డును ప్రకటించడం గర్వకారణం అని ఆయన చెప్పుకొచ్చరు.

Tags:    

Similar News