గేమ్ ఛేంజర్ - డైలాగ్ చంద్రబాబుకు కలిసివస్తోందా ..!
గేమ్ ఛేంజర్- ఈ మాట ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి తరచుగా వినిపిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు.. లేదా ప్రాజెక్టులు చేపట్టిన సమయంలో వాటిని ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ.. చంద్రబాబు చెబు తున్నారు.;
గేమ్ ఛేంజర్- ఈ మాట ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి తరచుగా వినిపిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు.. లేదా ప్రాజెక్టులు చేపట్టిన సమయంలో వాటిని ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ.. చంద్రబాబు చెబు తున్నారు. అయితే.. అలా ఆయన ప్రకటించిన గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు.. ఒకింత ఇబ్బంది పెడుతున్నా యనే చెప్పాలి. అవిముందుకు సాగకపోగా.. విమర్శలు.. వివాదాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు గేమ్ ఛేంజర్ డైలాగ్ కలిసి వస్తోందా? అనేది చర్చ.
1) పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో కర్నూలు గడ్డపై నుంచి మాట్లాడిన చంద్రబాబు.. దీనిని రాయలసీమకు గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. అప్పుడే కాదు.. తర్వాత రెండు సార్ల ఈ ప్రాజెక్టుపై.. మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఇదే చెప్పారు. గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. కానీ, ఈ ప్రాజెక్టు తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిందే.
2) పీ-4 పథకాన్ని ప్రారంభించినప్పుడు కూడా చంద్రబాబు దీనిని గేమ్ ఛేంజర్‌గా ప్రకటించారు. పీ-4 (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్) ద్వారా పేదల జీవితాలు మారుతాయని.. ఇది వారికి గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీ-4 ద్వారా పేదల కుటుంబాలను దత్తత తీసుకుని.. వారిని అభివృద్ది బాటలో నడిపించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ప్రాజెక్టు కూడా నత్తనడకన సాగుతోందన్నది వాస్తవం.
3) పీపీపీ- పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు భావించారు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రస్థాయి రహదారులను కూడా పీపీపీ మోడల్‌లో నిర్మించి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రకటన చేసినప్పుడు కూడా పదే పదే ఆయన గేమ్ ఛేంజర్‌గా వ్యాఖ్యానించారు. ``పీపీపీ మోడల్ ఓ గేమ్ ఛేంజర్. ప్రజలకు అనేక సౌకర్యాలు వస్తాయి`` అని పదే పదే చెప్పారు.
కానీ, చిత్రంగా పీపీపీ విధానం కూడా ముందుకు సాగడం లేదు. సో.. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సెంటిమెంటుగా మారుతాయి. గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ చేస్తే.. ఇబ్బందులు వస్తాయని కేసీఆర్‌కు పలువురు సూచించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆయన వినకుండా మార్పు చేశారు. అప్పటి నుంచి ఏం జరిగిందో తెలిసిందే. సో.. సెంటిమెంటుకు రాజకీయాల్లో కీలక రోల్ ఉన్నదన్న విషయం తెలిసిందే.