• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి వర్గ విస్తరణకు...

మంత్రి వర్గ విస్తరణకు బాబు రెడీ ?

| ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన జూన్ 12తో పూర్తి చేసుకుంది. మరో మూడేళ్లలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఉంటాయి. అయితే చివరి ఏడాదిని అంతా ఎన్నికల ఏడాదిగానే చూస్తారు.

By - Satya P
Update: 2026-06-21 06:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన జూన్ 12తో పూర్తి చేసుకుంది. మరో మూడేళ్లలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఉంటాయి. అయితే చివరి ఏడాదిని అంతా ఎన్నికల ఏడాదిగానే చూస్తారు. దాంతో ఆ ముందు తీసుకునే నిర్ణయాలు జనంలో ప్రభావితం చేయలేవు. ఈ లెక్కన చూస్తే ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు ఇదే తగిన సమయం అని అంటున్నారు. ఎందుకంటే కొత్తగా మంత్రులు అయ్యేవారి చేతిలో నికరమైన అధికారాలు ఆవకాశాలు ఎన్నికల ఏడాదిని మినహాయిస్తే కచ్చితంగా రెండేళ్ళ పాటు ఉంటాయి. దాంతో పాలనా పరంగా రాజకీయ పరంగా కూడా అనుకున్న మార్పులను తీసుకుని వచ్చేందుకు వారికి చాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తే ఎపీలో కూటమి మంత్రి వర్గ విస్తరణకు వేళాయేనా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇవే కొలమానాలు :

మంత్రి వర్గంలో ఎవరు చేరాలన్నా లేదా ఉన్న వారిని తీసి పక్కన పెట్టాలని అన్నా కూడా కొలమానాలు ఉన్నాయి. అదే పాలనాపరమైన పనితీరుని నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా కూడా తమ సమర్ధత చాటుకోవాల్సి ఉంటుంది. కేవలం పనితీరు బాగుందని అనుకుంటే రాజకీయ వ్యూహాలలో తేలిపోరాదు. ఈ రెండూ చేయగల సమర్థులకే మంత్రి పదవులు దక్కుతాయని అంటున్నారు. జిల్లాలలో మంత్రులు తాము రాజకీయ వ్యూహ రచన చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్న వారుగా తమ శాఖల పట్ల పట్టుని నిరూపించుకుంటూ ప్రతిపక్షాన్ని కట్టడి చేయాల్సి ఉంటుంది.

కొత్త వారితో ప్రయోగం :

ఇక చూస్తే కనుక 2024లో చంద్రబాబుతో పాటుగా చేరిన 24 మంది మంత్రులలో అత్యధికులు కొత్త వారు కావడం విశేషం. వారంతా ఒకసారి గెలిచిన వారే. కొందరు అయితే రెండు సార్లు గెలిచి వచ్చారు. అయితే కొత్త వారికి అవకాశాలు అని కూటమి ప్రభుత్వం ఒక ప్రయోగం చేసింది అని అంటున్నారు. అయితే రెండేళ్ల కాలంలో చూస్తే కనుక కేబినెట్ లో పలువురు మంత్రులు తమ పనితీరుని మెరుగుపరచుకోలేకపోతున్నారు అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు చాలా సార్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా ర్యాంకులు ఇచ్చి మరీ పనితీరు మార్చుకోవాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కొందరు మార్చుకున్నారు, మరి కొందరు అలాగే ఉన్నారు. దాంతోనే కొందరి ఉద్వాసన తప్పదని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో సీనియర్లకు సమర్ధత కలిగిన వారికి చోటు కల్పిస్తారు అని చెబుతున్నారు.

కేంద్ర మంత్రి వర్గంతోనే :

కేంద్ర మంత్రి వర్గం త్వరలోనే విస్తరణ ఉంటుందని అంటున్నారు. జూన్ నెలాఖరులో కానీ జూలై మొదటి వారంలో కానీ మంత్రి వర్గాన్ని విస్తరించడం జరుగుతుందని అంటున్నారు. ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కేంద్ర మంత్రి పదవులు కాస్తా అయిదు లేక ఆరు అవుతాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర మంత్రి పదవులు అందుకున్న వారి జాబితాను పరిశీలించి అలాగే సామాజిక ప్రాంతీయ రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం ఆ తరువాత మంత్రి వర్గ విస్తరణ చేపడుతుందని అంటున్నారు.

శ్రావణమాసమేనా :

ఇక ఆగస్టు నెలలో శ్రావణ మాసం వస్తుంది. ఆ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చు అని ప్రచారం అయితే సాగుతోంది. ఒక వేళ అలా కాదు అనుకుంటే ఆశ్వీయుజ మాసం దసరా ముందున మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తంగా ఎంచుకోవచ్చు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే కూటమి మంత్రి వర్గ విస్తరణ తప్పదని అంటున్నారు. పలువురుకి మంత్రి పదవుల గండం ఉందని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే మంత్రులుగా చేరబోయే వారి పేర్లు కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఒట్టి ఊహాగానాలే అని బాబు కనుక విస్తరణ తలపెడితే అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి మరీ తనదైన శైలిలో మార్పు కూర్పు చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • apcabinet 
  • chandrababunaidu 
  • andhrapradesh 
  • cabinetexpansion 
  • appolitics 
  • tdp 
  • janasena 
  • bjp 
  • ministerreshuffle 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS