• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విశాఖ మంత్రులు చాలా...

విశాఖ మంత్రులు చాలా మందేనట !

| ఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ పునర్ వ్యవస్థీకరణ కానీ లేక భారీగా మార్పులు చేర్పులు కానీ ఉంటాయా లేదు అసలు ఉండవని టీడీపీ అధికారికంగానే స్పష్టం చేసింది.

By - Satya P
Update: 2025-08-02 03:31 GMT

ఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ పునర్ వ్యవస్థీకరణ కానీ లేక భారీగా మార్పులు చేర్పులు కానీ ఉంటాయా లేదు అసలు ఉండవని టీడీపీ అధికారికంగానే స్పష్టం చేసింది. అవన్నీ అనవసర ఊహాగానాలు అదే విధంగా చెడు ప్రచారాలు అని కూడా కొట్టిపారేసింది. అయినా సరే ఈ ప్రచారాలకు ఎక్కడా చెక్ పడడం లేదు. అంతే కాదు చాలా మంది రేసులోకి అలా దూసుకుని వచ్చేస్తున్నారు.

విశాఖ జిల్లా నుంచే :

ఒక్క విశాఖ జిల్లాలో చూస్తేనే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో టీడీపీ నుంచి చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశలు చాలానే పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన ఎపుడు ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి గ్యారంటీగా దక్కించుకునేవారు. అయితే 2024లోనే లెక్క మారింది. దాంతో ఆయన వర్గం డీలా పడింది. అయితే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయన్న వార్తలతో ఆయన వర్గీయులు ఆనందంగా ఉన్నారు తమ నేతకు కచ్చితంగా అమాత్య పీఠం దక్కుతుంది అని భావిస్తున్నారు. అదే విధంగా చూస్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి సామాజిక పరంగా మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రిని తప్పిస్తారని వార్తలు వస్తున్న క్రమంలో పల్లా వర్గంలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు.

మిత్రుల ప్రయత్నాలు వేరుగా :

ఇక మిత్రపక్షం నుంచి చూస్తే బీజేపీ ఎమ్మెల్యే విశాఖ నార్త్ నుంచి రెండు సార్లు గెలిచిన విష్ణు కుమార్ రాజు తన ప్రయత్నాలలో తాను ఉన్నారు. తాను మంత్రి అవాలని ఆయన చాలా గట్టిగా భావిస్తున్నారు. ఈసారి ఆయనకు రాజకీయంగా కీలక సమయం. వచ్చేసారి పోటీకి టికెట్ దక్కుతుందో లేదో తెలియదు దాంతో మంత్రి అనిపించేసుకుంటే తన రాజకీయానికి అర్ధం పరమార్ధం దక్కుతాయని ఆయన భావిస్తున్నారుట. అలాగే పెందుర్తికి చెందిన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఆశగా చూస్తున్నారు. ఆయన ఒకప్పుడు గంటా బ్యాచ్ లోని వారే. గంటా అనుచరులుగా ఉంటూ అవంతి శ్రీనివాస్ మంత్రి అయ్యారు తాను కూడా అయి తీరాల్సిందే అన్నది ఆయన ఆలోచనట. పైగా సామాజిక వర్గ సమీకరణలు ఆయనకు కలిసి వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో మరింతమంది :

ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు మంత్రి పదవి అని అంటున్నారు ఆయన అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సామాజిక వర్గం దన్ను ఉంది. పైగా పదిహేనేళ్ళుగా గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఆ సామాజిక వర్గం ఉంటుంది దాంతో తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక అనూహ్యంగా రేసులోకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా దూసుకుని వచ్చారని అంటున్నారు. ఆయన స్పీకర్ పదవిని త్యగ్జించి మంత్రిగానే రాజకీయ జీవితం ముగించాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.

అదే విధంగా మాడుగులకు చెందిన మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఒక్క చాన్స్ అంటున్నారు. ఆయన కూడా మంత్రి పదవిని కోరుతున్నారు. ఇలా చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. వీరు కాక మంత్రి అయితే బాగుంటుందని విశాఖ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామక్రిష్ణబాబు గణబాబు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చెరి నాలుగేసి సార్లు ఎమంల్యేలుగా నెగ్గిన అనుభవం కలిగిన వారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమిలో నూటికి తొంబై శాతం మంది ఎమ్మెల్యేలు మంత్రి సీటు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. మరి నిజంగా విస్తరణ ఉంటుందా ఉంటే ఎవరికి చాన్స్ దక్కుతుంది అన్నదే చూడాల్సి ఉంది మరి.

Tags:    
  • APPolitics 
  • CabinetExpansion 
  • ChandrababuNaidu 
  • TDP 
  • JanaSena 
  • BJP 
  • VisakhapatnamLeaders 
  • AndhraCabinetBuzz 
  • AP2024 
  • PoliticalAspirants 
  • GantaSrinivasarao 
  • Vishnukumarraju 
  • Chandrababu Naidu 
  • Andhra Cabinet Buzz 
  • Visakhapatnam Leaders 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS