ఆమె చేసిన పని జగన్ ఎందుకు చేయలేదు ?

ఆమె గురించి ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన పనిని అంతా ప్రస్తుతిస్తున్నారు. ఆమె విదేశీయురాలు.;

Update: 2025-04-14 09:23 GMT

ఆమె గురించి ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన పనిని అంతా ప్రస్తుతిస్తున్నారు. ఆమె విదేశీయురాలు. ఆమె వేరే మతాన్ని నమ్మి ఉన్నారు. కానీ ఆమె హిందువులు అందరూ గర్వించేలా తిరుమలలో వ్యవహరించారు. ఆమె ఎవరో కాదు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినేవా అని చెప్పాలి.

ఆమె తిరుమలకు ఆదివారం సాయంత్రం వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందు తనకు ఆ దేవదేవుడి మీద విశ్వాసం ఉందని డిక్లరేషన్ మీద సంతకం చేశారు. అంతే కాదు ఆమె తన తలనీలాలు ఆ స్వామిని సమర్పించుకున్నారు. సోమవారం సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద 17 లక్షల చెక్ ని టీటీడీ అధికారులకు అందజేయడం ద్వారా అన్నదానానికి భారీ విరాళం ఇచ్చారు. ఇలా ఆమె ఇపుడు అందరి నోటా మారు మోగుతున్నారు. ఆమె కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు. కానీ హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఇదంతా చేశారు.

మరి ఇదే పని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు చేయరు అన్న చర్చ సాగుతోంది. తిరుమల లడ్డూ కల్తీ జరిగింది అన్న వార్తలు గత ఏడాది సెప్టెంబర్ టైం లో వచ్చినపుడు జగన్ తిరుమల వెళ్ళాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో టీడీపీ వారు ఆందోళన చేశారు.

జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దాంతో మొత్తం పరిస్థితి ఉద్రిక్తం అవుతుందని భావించి చివరి నిముషంలో జగన్ రద్దు చేసుకున్నారు. ఇపుడు అన్నా లెజినేవా తిరుమల పర్యటనలో పూర్తిగా అన్ని పద్ధతులను ఆచరించి చూపడంతో సోషల్ మీడియాలో ఆనాటి జగన్ తిరుమల టూర్ ఆయన చివరి నిముషంలో రద్దు చేసుకోవడం ఇదంతా డిస్కషన్ గా సాగుతోంది.

నిజానికి చూస్తే వైఎస్సార్ కి ఎపుడూ ఈ డిక్లరేషన్ సమస్య రాలేదు. ఆయన చక్కని పంచెకట్టుతో ఉంటూ తెలుగు కల్చర్ ని పాటించే వారుగా పెద్దాయన గా పేరు పొందారు. అదే జగన్ వద్దకు వచ్చేసరికి వివాదం అయింది. అయితే ఏ వివాదం అయినా దానిని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి. జగన్ కూడా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని భావించకుండా జనాలకు తాను జవాబు అన్నట్లుగా డిక్లరేషన్ మీద సంతకం చేసి ఉంటే సరిపోయేది అని అంటున్నారు.

ఇక ఇక్కడ మరో పోలిక కూడా తెస్తున్నారు. అన్నా లెజినేవా తన తల నీలాలు సైతం సమర్పించి భక్తిగా వ్యవహరించడం పట్ల అంతా ప్రశంసిస్తూనే జగన్ సతీమణి భారతీ ఏ రోజూ తిరుమలకు రాలేదని గుర్తు చేసుకుంటున్నారు. అయిదేళ్ళ పాటు బ్రహ్మోత్సవాలు జరిగినపుడు సతీమణిని వెంట తీసుకుని జగన్ రావాల్సి ఉండగా ఆమె రాలేదని అంటున్నారు.

అలా తిరుమలలో ఉన్న సున్నితమైన నిబంధనలు ఎంతటి వారు అయినా పాటిస్తేనే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ హయాంలో విశాఖ శ్రీ శారదా పీఠంలో యాగాలు చేశారు, పూజలు చేశారు. హిందూ పండుగలలో పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాలలో పంచాంగ శ్రవణం విన్నారు. అలాగే క్రిష్ణా తీరాన పుష్కరాల సమయంలో కూలిన గుడులను ఆయన నిర్మించారు.

ఇలా అనేకం చేసినా కూడా ప్రపంచ దేవుడు అయిన తిరుమల విషయంలో జనాలు అంతా ఎక్కువ అటెంక్షన్ చూపించారు అని అంటున్నారు. హిందువుల మనోభావాల మేరకు డిక్లరేషన్ మీద సంతకం చేస్తే పోయేదానికి అపుడు రచ్చ చేసుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన కుమార్తెని అప్పట్లో తిరుమల తీసుకుని వచ్చినపుడు ఆమె చేత డిక్లరేషన్ ఇప్పించారు.

ఇపుడు ఆయన సతీమణి నూరు శాతం తిరుమల నిబంధనలు పాటించి హిందువుల అభిమానాన్ని చూరగొన్నారు అని అంటున్నారు. మరి ఏలికలు పెద్ద వారు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అంటున్నారు. మొత్తానికి అన్నా లెజినేవాకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె వెనక ఉన్న పవన్ సనాతన ధర్మం మీద తన నిబద్ధతను ఇలా చాటుకున్నారని కొనియాడుతున్నారు.

Tags:    

Similar News