• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లి విందులో పనీర్ ...

పెళ్లి విందులో పనీర్ వడ్డించలేదని.. ఆరుగురు అతిథులను గాయపరిచాడు!

| ఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాలో ఒక వ్యక్తి ఓ వివాహ వేడుకలోకి మినీ బస్సును తీసుకెళ్లి ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు గాయపడిన ఘటన తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-04-29 15:28 GMT

ఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాలో ఒక వ్యక్తి ఓ వివాహ వేడుకలోకి మినీ బస్సును తీసుకెళ్లి ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు గాయపడిన ఘటన తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆరుగురు వ్యక్తులు గాయపడటంతో పాటు సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంతకీ ఈ ఘటనకు కారణం ఏమిటంటే... 'పనీర్'!

అవును... ఉత్తరప్రదేశ్ లోని కొత్వాలి ప్రాంతంలోని హమీద్ పూర్ గ్రామంలో రాజ్ నాథ్ యాదవ్ కుమార్తె వివాహం జరిగింది. ఈ సందర్భంగా సాయంత్రం ఆలస్యంగా వివాహ ఊరేగింపు వేదిక వద్దకు చేరుకుంది. ఈ సమయంలో ధర్మేంద్ర యాదవ్ అనే ఓ వ్యక్తి వివాహ వేడుకలోకి ప్రవేశించి నేరుగా ఫుడ్ స్టాల్స్ వైపు వెళ్లాడు.

ఈ సమయంలో.. ధర్మేంద్ర యాదవ్ కి ఇతర వంటకాలలో పనీర్ దొరకలేదు. దీంతో.. అతనికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. దీంతో... ఓ మినీ బస్సును పెళ్లి వేడుక మధ్యలోకి నడిపాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఇదే సమయంలో... రూ.3 లక్షలకు పైగా విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని రాజ్ నాథ్ యాదవ్ తెలిపారు.

ఈ దాడిలో గాయపడినవారిలో వరుడి తండ్రి, వధువు మేనమామ సహా అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారు వారణాసిలోని ట్రామా సెంటర్ లో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతరం వరుడి తరుపు వారు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన అనంతరం.. వరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహ వేడుక ముగిసింది.

Tags:    
  • UttarPradesh 
  • Chandouli 
  • WeddingIncident 
  • PaneerFight 
  • FoodFury 
  • WeddingViolence 
  • IndiaNews 
  • WeddingDisaster 
  • UPNews 
  • ViolenceAtWedding 
  • FoodDispute 
  • IndianWedding 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS