ఆ ఒక్క సర్వేతో టీడీపీ పులి అయిపోతోందా...?
ఏపీలో టీడీపీకి గ్రాఫ్ పెరిగింది అని కూడా చెప్పుకొస్తోంది. ఇండియా టు డే, సీ ఓటర్ సర్వేకు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉందని అంటున్నారు.;
ఏపీలో ఒక సర్వే నివేదిక ఇపుడు మరో రాజకీయ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా ఇండియా టూ సీ ఓటర్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఈ సర్వేని విడుదల చేస్తూంటారు. ఈ సర్వేలో ప్రధానంగా దేశంలో ఉన్న పరిస్థితులనే ఎక్కువగా వెల్లడిస్తూంటారు.
అలా చూసుకుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ కి గతం కంటే గ్రాఫ్ కొంత తగ్గినా ముచ్చటగా మూడవసారి ఆయన అధికారంలోకి రాగలరని ఈ సర్వే వెల్లడించింది. అంతే కాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కచ్చితంగా మరోసారి మోడీ అధికారం చేపడతారు అని సర్వే అంటోంది.
ఇక దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కూడా వెల్లడించిన ఈ సర్వే తెలంగాణాలో కేసీయార్ బీయారెస్ పార్టీకి ఆరు సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కి ఏడు ఎంపీ సీట్లు ఇచ్చింది. బీజేపీకి నాలుగు సీట్లు ఇచ్చింది. ఇక ఏపీ విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు
అయితే ఈ సర్వే మీద జరిగిన డిబేట్ లో మాత్రం సెఫాలజిస్ట్ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏపీలో టీడీపీకి 15 దాకా ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారన్నది ఇపుడు ఎల్లో మీడియాలో బాగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ప్రభుత్వం కచ్చితంగా మారుతుంది అంటూఒ టీడీపీ అనుకూల మీడియా తెగ ఊదరగొడుతోంది.
ఏపీలో టీడీపీకి గ్రాఫ్ పెరిగింది అని కూడా చెప్పుకొస్తోంది. ఇండియా టు డే, సీ ఓటర్ సర్వేకు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉందని అంటున్నారు. దీంతో వైసీపీ నుంచి కౌంటర్లు వచ్చి పడుతున్నాయి. ఏకంగా విజయసాయిరెడ్డి దీని మీద ఫైర్ అయ్యారు. ఎన్నో జాతీయ సంస్థలు ఏపీలో వచ్చేది వైసీపీయే అంటూ నివేదికలు ఇచ్చినపుడు ఫేక్ సర్వేలు అంటూ కొట్టి పారేసిన టీడీపీ దాని అనుకూల మీడియా ఇపుడు మాత్రం ఈ సర్వే అద్భుతం అని చెప్పడం పట్ల ఆయన మండిపడ్డారు.
తమకు ఫేవర్ గా వస్తే సర్వే సూపర్ అని లేకపోతే ఫేక్ అని చెప్పడం టీడీపీకి అలవాటుగా మారిందని అన్నారు. అసలు సర్వేల గురించి ఎందుకు టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏ టీడీపీ కార్యకర్త కూడా గట్టిగా నమ్ముతున్నాడా అని ఆయన ప్రశ్నించారు విషయం ఇలా ఉంటే సర్వేలు అంటూ టీడీపీ హుషారెత్తడమేంటని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పటిదాకా వచ్చిన జాతీయ సర్వేలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. దాంతో టీడీపీ ఏమీ అనలేకపోయింది. పైగా ఫేక్ అంటూ ఒక్క మాటతో పక్కన పెట్టేసేది. ఇండియా టూడే సర్వే మాత్రం టీడీపీకి నచ్చిందని అంటున్నారు. దాంతో పులి అయిపోతోందని సెటైర్లు పేలుతున్నాయి. అయితే సర్వేల సంగతి ఎలా ఉన్నా ఏపీలో చూస్తే ఇంకా అధికార పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఎక్కడా కనిపించడంలేదు, ఎన్నికలు నెలల దగ్గరకు వచ్చాయి.
ఇప్పటికే ఒక ఒపీనియన్ బిల్డ్ అవాలి. కానీ అలా జరగలేదు అంటే ఏదో మతలబు ఉంది అనే అంటున్నారు. మరో వైపు చూస్తే రూరల్ సెక్టార్ లో వైసీపీకి సిక్స్టీ టీడీపీకి ఫార్టీ, అర్బన్ సెక్టార్ లో టీడీపీకి సిక్స్టీ వైసీపీకి ఫార్టీ పర్సెంట్ గా జనాభిప్రాయం అనుకూలంగా ఉందని జనరల్ గా వస్తున్న సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు. ఏపీలో రూరల్ సెక్టార్ అధికంగా ఉంది. ఓటర్లు కూడా ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. సో అలా చూసుకుంటే వైసీపీకే ఈ రోజుకీ ఎడ్జి ఉందని న్యూట్రల్ గా ఉండే వారు అయితే అంటున్నారు. ఎన్నికల టైం కి ఏమైనా కొంత మారితే మారవచ్చేమో కానీ ఈ రోజు పరిస్థితి ఇదేనని అంటున్నారు.