రెండు లక్షల రేషన్ కార్డులు కట్ ?
ఇక మార్చి నెలాఖరుతో ఈ కేవైసీ గడువుని ముగుస్తుందని తొలుత ప్రకటించినా దానిని జూన్ 30 దాకా పొడిగించుకుని వస్తున్నారు.;
ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇక రేషన్ కార్డులు పొందాలనుకున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అదే సమయంలో రేషన్ కార్డులు ఉన్న వారు అంతా తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి గత కొన్ని నెలలుగా ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది.
ఈ కేవైసీ ద్వారా చాలా మంది కార్డులు పోతాయని అంటున్నారు. చనిపోయిన వారి పేరిట కూడా రేషన్ తీసుకుంటున్న వారి చర్యలకు చెక్ పడుతుందని అంటున్నారు. అలాగే ఎక్కడో ఉండి ఇక్కడ అడ్రసులు ఇచ్చిన వారికి కూడా దీని వల్ల అడ్డుకట్ట పడుతోంది. ఇలా చాలా విధాలుగా భోగస్ కార్డులకు చెక్ పెట్టడానికే ఈ కేవైసీ ని తీసుకుని వచ్చారు.
ఇక మార్చి నెలాఖరుతో ఈ కేవైసీ గడువుని ముగుస్తుందని తొలుత ప్రకటించినా దానిని జూన్ 30 దాకా పొడిగించుకుని వస్తున్నారు. మరి కొద్ది రోజులలో జూన్ ముగుస్తోంది. దాంతో ఈ కేవైసీ కూడా ముగుస్తోంది. దాంతో ఈ కేవైసీ చేయించుకోవని వారికి కొత్తగా ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులు దక్కవు. వారు రేషన్ కార్డుని పూర్తిగా పోగొట్టుకున్నట్లే అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కొత్త రేషన్ కార్డుల జారీకి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. మరోసారి ఏపీ వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా భోగస్ రేషన్ కార్డుల మీద సర్వేను చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు రేషన్ కార్డుదారుల ఆదాయ వ్యయాలు వారి జీవిత ప్రమాణాలు వారి నివాసాలు వారిచ్చిన విషయాలు అసలైనవేనా అన్న దాని మీద సర్వే చేస్తారు అని ప్రచారం సాగుతోంది.
ఆ మీదట రేషన్ కార్డులు కొత్తవి పంపిణీ చేస్తారు అని అంటున్నారు. ప్రభుత్వానికి అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఏపీ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా భోగస్ కార్డులు ఉన్నాయని అంటున్నారు వీటిని ఏరివేస్తే తప్ప అర్హులకు కార్డులు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని అంటున్నారు మరో వైపు చూస్తే కొత్తగా మూడు లక్షల మంది దాకా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు
దాంతో రెండు లక్షల కార్డులను తొలగిస్తూ మూడు లక్షల కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో ఈ ప్రక్రియలో మరికొంతకాలం అవుతుందని అంటున్నారు. దాంతో కొత్త రేషన్ కార్డు ఎపుడు అంటే ఇంకా ఆగాల్సిందే అన్న మాట వినిపిస్తోంది.