ఇలా అయితే ఎవరు మాత్రం పనిచేస్తారు బాబూ.. !
దీనికి ప్రధానంగా నామినేటెడ్ పదవుల విషయంలో జరుగుతున్న తాత్సారమే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో 22 వేల పైచిలుకు ఉన్నాయి.;
క్షేత్రస్థాయిలో నాయకులు ముందుకు రావడం లేదు. అనుకున్న విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించ డం లేదు. ప్రభుత్వం తరఫున బలమైన వాయిస్ కూడా వినిపించడం లేదు. ఇదీ.. చంద్రబాబును వేధి స్తున్న అంశం. అయితే.. దీనికి కారణం.. తమకు ఎలాంటి గుర్తింపు లేదని నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇస్తామన్న పదవులు కూడా ఇవ్వలేదన్న ఆవేదన కూడా వారిలో ఉంది. దీంతో నాయకులు బయటకు రావడం లేదు. పైగా.. పార్టీ పై విమర్శలు వస్తున్నా చోద్యం చూస్తున్నారు.
ఏంటీ కారణం.?
దీనికి ప్రధానంగా నామినేటెడ్ పదవుల విషయంలో జరుగుతున్న తాత్సారమే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో 22 వేల పైచిలుకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 2 వేల పైచిలుకు మాత్రమే భర్తీ చేశారు. పోనీ.. నిధుల కొరతతో 10 వేల పోస్టులను భర్తీ చేయకపోయినా.. కీలక మైనమార్కెట్ యార్డు, దేవాలయాల కమిటీలను భర్తీ చేయొచ్చు. తద్వారా నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెంచే చర్యలు చేపట్టవచ్చు. అయితే.. దీనికి కూడా ప్రభుత్వం ఉత్సాహం చూపించడం లేదు.
ఇదే విషయాన్ని అనుకూల మీడియా తాజాగా హైలెట్ చేసింది. పదవులు ఇవ్వకపోతే.. ఎలా? అంటూ.. ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలనే సదరు పత్రిక ప్రచురించింది. దీనిపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము బహిరంగంగా చెప్పుకోలేని అనేక విషయాలను పత్రి క బయట పెట్టిందని అంటున్నారు. ఇది వాస్తవం కూడా. అనేక మంది నాయకులు.. గత ఎన్నికల్లో అప్పులు చేసి మరీ పార్టీ కోసం కష్టపడ్డారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది ఎప్పటినుంచో ఉన్న చర్చ.
``ఇప్పుడు మాకు పదవులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. దేవాలయాల కమిటీలను నియమించవచ్చు. మాకంటూ.. ఒక గుర్తింపు వస్తుంది. దీనిని ఆశించడం తప్పని మేం అనుకోవడం లేదు.`` అని ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మరి వారికి చంద్రబాబు కొంత ఆదరవు కల్పిస్తే.. ఆ తర్వాత వారు తమంతట తాముగా.. ప్రభుత్వానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.