మంత్రులకు బాబు మార్క్ అలెర్ట్!

ఏపీ కేబినెట్ లో మంత్రులు అధిక శాతం కొత్తవారుగా ఉన్నారు. దాంతో వారికి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.;

Update: 2025-04-14 02:45 GMT

ఏపీ కేబినెట్ లో మంత్రులు అధిక శాతం కొత్తవారుగా ఉన్నారు. దాంతో వారికి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఫలానా విధంగా వ్యవహరించాలని ఆయన చెబుతూ ఉంటారని ప్రచారంలో ఉంది.

అయితే ఇటీవల కాలంలో మంత్రుల పేషీలలో ఉండే అధికారుల విషయంలో ఆరోపణలు వస్తున్నాయి. మంచి అధికారులను పేషీలలో పెట్టుకోవాలని బాబు గతంలోనే పలు మార్లు మంత్రులకు చెప్పి ఉన్నారు. అయితే కొందరు అధికారుల తీరు మాత్రం మారకపోగా ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చేలా ఉందని కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది.

దీంతో మంత్రుల పేషీల మీందనే సర్కార్ పెద్దలు కన్నేసి ఉంచారని అని అంటున్నారు. ఒక పేషీలలో ఉన్న పీఎస్ లు, పీఏలు ఓఎస్డీల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ మీద అవినీతి అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించారు.

ఇక ఇంటెలిజెన్స్ నుంచి కూడా నిఘా పెట్టించి ఎప్పటికప్పుడు మంత్రుల పేషీలలో జరుగుతున్నది ఏమిటి అన్నది ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారు. అయింతే పేషీలలో జరుగుతున్న వ్యవహారాల పట్ల ఇప్పటికీ కొందరు మంత్రులు ఉదాశీనంగా ఉన్నారని అంటున్నారు. దాంతో ఈ నెల 15న జరిగే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకించి ఇదే విషయం మీద మంత్రులకు క్లాస్ తీసుకుంటారు అని ప్రచారం అయితే సాగుతోంది.

మంత్రుల పేషీలలో అధికారుల తీరు వల్ల కొందరు చేసే అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని అంటున్నారు. కొందరు మంత్రులు ఇప్పటికీ పేషీలలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు. అందుకే వారి మీదనే ఆధారపడుతున్నారని అంటున్నారు.

దాంతో ఈసారి మ్యాటర్ వెరీ సీరియస్ అని చంద్రబాబు చెప్పాలని చూస్తున్నారు అని అంటున్నారు. మంత్రులు తమ పేషీలలో ఏమి జరుగుతోంది అన్నది తెలుసుకోవాలని బాబు దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఒక రకంగా నిఘా పెట్టాల్సి ఉందని కూడా సూచిస్తారు అని అంటున్నారు.

ఏ ఏ శాఖలలో ఏఏ పేషీలలో కొందరు అధికారులు చేస్తున్న నిర్వాకం మీద ప్రభుత్వం వద్ద ఉన్న నివేదికలను కూడా ఆయా మంత్రుల ముందు ఉంచి మరీ ముఖ్యమంత్రి వారిని జాగ్రత్తగా ఉండమని అలెర్ట్ చేస్తారు అని అంటున్నారు.

ఇలా జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటే చివరికి అది మంత్రులు ఇబ్బంది పడేలా కూడా వస్తుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ నెల 15న జరిగే కేబినెట్ మీటింగులో మ్యాటర్ సీరియస్ గానే ఉండొచ్చు అని ప్రచారం అయితే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News