• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీకి భయపడి హిందీని...

బీజేపీకి భయపడి హిందీని ప్రమోట్ చేస్తున్నారు...జగన్ కూడా ?

| దక్షిణాదిన హిందీ భాష మీద వివాదం సాగుతోంది. తమిళనాడు అయితే దశాబ్దాల క్రితమే హిందీ వద్దు అని అతి పెద్ద ఉద్యమం నిర్వహించింది.

By - Tupaki Desk
Update: 2025-07-16 17:44 GMT

దక్షిణాదిన హిందీ భాష మీద వివాదం సాగుతోంది. తమిళనాడు అయితే దశాబ్దాల క్రితమే హిందీ వద్దు అని అతి పెద్ద ఉద్యమం నిర్వహించింది. హిందీ గురించి ఎంతో గొప్పగా చెప్పే బీజేపీ నాయకులు సైతం తమిళనాడుకు వస్తే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు. అలా హిందీ విషయంలో తమిళులను ఒప్పించలేక పోయిన విషయం కళ్ళ ముందు ఉంది. మరో వైపు చూస్తే హిందీ భాష మీద ఎవరికి ఏ రకమైన అభిప్రాయం ఉన్నా హిందీ పేరు చెప్పి ఆధిపత్య రాజకీయాలకు తెర తీస్తున్నారు అన్నది అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రబలంగా ఉంది.

పైగా హిందీ కంటే ద్రవిడ భాషలు ప్రాచీనమైనవి అని అందువల్ల కేవలం హిందీని మాత్రమే జాతీయ భాషగా చెప్పడం ఏ మేరకు సమంజసం అని కూడా విమర్శలు ఉన్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే ఏపీలో మాత్రం అన్ని పార్టీల నాయకులు తరత భేదం లేకుండా హిందీని జాతీయ భాషగా ప్రమోట్ చేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ హిందీని రాజభాష అంటే నిన్న నారా లోకేష్ హిందీని జాతీయ భాష అన్నారు. ఇపుడు జగన్ సైతం అదే అంటున్నారు.

హిందీ జాతీయ భాషే ఇందులో వేరేగా చర్చించడానికి ఏముంది అని ఆయన అంటున్నారు. ఆయనను మీడియా హిందీ భాష వివాదం గురించి ప్రశ్నించినపుడు జగన్ స్పందిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు. హిందీ భాష జాతీయ భాషే అని ఆయన అంటూ స్పష్టత కూడా ఇచ్చేశారు.

దేశంలో ఏ రాష్ట్రం వారు అయినా తొలి లాంగ్వేజ్ తమ మాతృ భాషను ఎంచుకోవచ్చు, రెండవ భాషగా హిందీని కచ్చితంగా పెట్టాలని మూడవ భాషగా ఇంగ్లీష్ ఉండాలని జగన్ ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని ఆయన అంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోకపోతే అన్ని విధాలుగా వెనకబడతామని అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్ధులు ఇంగ్లీష్ ని సరిగ్గా నేర్చుకోకపోయినా స్పష్టంగా పలకకపోయినా మాట్లాడకపోయినా ప్రపంచంతో పోటీ పడలేరని జగన్ అన్నారు. ఇక ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉన్నా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ గా తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు అని జగన్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే పనిగట్టుకుని మరీ ఏపీ నాయకులు హిందీని ప్రమోట్ చేయడం పట్ల రాజకీయంగా చర్చ సాగుతోంది. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో అన్న ఆలోచనతోనే ఎవరికి వారు హిందీ జాతీయ భాష అంటున్నారు. నిజానికి హిందీ జాతీయ భాష కాకపోయినప్పటికీ దానిని ప్రమోట్ చేయడం కోసం పోటీలు పడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ జనసేన సరసన వైసీపీ కూడా చేరింది అని అంటున్నారు.

నిజానికి భాషకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మిక్స్ చేయాలని కొందరు చూస్తున్నారు అని భాషావేత్తలు అంటున్నారు. భాషతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఒక వైపు మేధావులు అంటూంటే మరో వైపు అదే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీడియా సైతం గుచ్చి గుచ్చి అవే ప్రశ్నలు వేస్తోంది. మరి దానికి సరైన జవాబులు చెప్పవచ్చు. కానీ ఎవరూ హిందీని కాదు అనలేకపోతున్నారు. ఆ విధంగా చూస్తే దేశంలో ఎక్కడా లేని హిందీ అభిమానం ఏపీలో బాగా కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇది నిజంగా బీజేపీ సాధించిన విజయమా లేక బీజేపీ అభిమానం ప్రాపకం కోసం ఏపీ రాజకీయ నేతలు అంతా కలసి చేస్తున్న భాషా విన్యాసమా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి చూస్తే హిందీకి జై హింద్ అంటున్న ఏపీ పార్టీలను నాయకులను దక్షిణాది రాష్ట్రాల నాయలుకు పార్టీలు ఏ విధంగా చూస్తాయో ఏ విధంగా ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాయో తెలియదు కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఫుల్ హ్యాపీస్ అవుతారేమో.


'పిల్లలకు ఇంగ్లిషే ముఖ్యం...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోకపోయినా, ఆంగ్లంలో స్పష్టంగా మాట్లాడలేకపోయినా ప్రపంచంతో పోటీ పడలేరు.

మీడియం ఇంగ్లిష్ అయితే.. పిల్లలు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని నచ్చిన భాష నేర్చుకోవచ్చు. ఆయా రాష్ట్రాల మాతృభాష కచ్చితంగా ఫస్ట్… pic.twitter.com/paygOfdjsy

— Tupaki (@tupaki_official) July 16, 2025


Tags:    
  • HindiDebate 
  • SouthIndiaPolitics 
  • APSupportsHindi 
  • LanguagePolitics 
  • Jagan 
  • BJPStrategy 
  • APPolitics 
  • LanguageDebate #HindiPromotion 
  • Chandrababu 
  • NaraLokesh 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS