• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సంక్రాంతి స్పెషల్: ఆంధ్రా...

సంక్రాంతి స్పెషల్: ఆంధ్రా అల్లుడికి 130 రకాల తెలంగాణ వంటలతో అదరగొట్టారు

| కొత్తగా పెళ్లైన వేళలోనూ.. పండక్కి ఊరికి వచ్చే కొత్త అల్లుడికి భారీగా వంటలు చేసి పెట్టే అత్తారింటి ముచ్చట్లు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి.

By - Tupaki Desk
Update: 2025-01-13 04:54 GMT

మర్యాదలకు గోదారోళ్లు ఎంత ఫేమస్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా పెళ్లైన వేళలోనూ.. పండక్కి ఊరికి వచ్చే కొత్త అల్లుడికి భారీగా వంటలు చేసి పెట్టే అత్తారింటి ముచ్చట్లు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అలాంటి మర్యాదలకు ఈసారి హైదరాబాద్ వేదికైంది. ఆంధ్రా అల్లుడు సంక్రాంతికి హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా 130 రకాల తెలంగాణ వంటకాల్ని చేసి.. అల్లుడి ఎదుట పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అయ్యింది.

ఆంధ్రా అల్లుడికి హైదరాబాద్ లోని అత్తారింట్లో మర్యాదలు ఆసక్తికరంగానే కాదు అబ్బురపడేలా ఉన్నాయి. కాకినాడకు చెందిన అల్లుడికి పెళ్లైన తర్వాత పండక్కు ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 130 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్ లో ఉండే క్రాంతి - కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకిడాకు చెందిన మల్లికార్జున్ తో నాలుగు నెలల క్రితమే పెళ్లి చేశారు.

తొలిసారి సంక్రాంతికి అల్లుడు తమ ఇంటికి వస్తున్న వేళ.. అతగాడ్ని సర్ ప్రైజ్ చేసేందుకు భారీ విందును సిద్ధం చేశారు. అతగాడికి తెలీకుండానే 130 రకాల భారీ మెనూను ప్రిపేర్ చేసి.. భోజనం కోసం రమ్మని చెప్పి.. భారీ విస్తరాకులో వడ్డించిన ఈ వంటల్ని చూసి అవాక్కు కావటం అల్లుడి వంతైందని. ఇందులో పిండి వంటలతో పాటు నాన్ వెజ్ వంటకాలు కూడా ఉన్నాయి. అల్లుడా మజాకానా.

Tags:    
  • Andhrapradesh 
  • Sankranti 
  • Sankratispecial 
  • Specialdishes 
  • Andhraalludu 
  • Telangana 
  • Hyderbad 
  • Kakinada 
  • Kranti 
  • Kalpana 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS