• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చిరు, బాలయ్య, యాంకర్...

చిరు, బాలయ్య, యాంకర్ శ్యామల... మీకర్ధమవుతోందా?

| ఈ సందర్భంగా ఏపీలో కూటమి పాలనలో మహిళల రక్షణ ప్రశ్నార్థకం అయ్యిందని ఆమె ఫైర్ అయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-10-08 13:52 GMT

వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె... టీడీపీ తరుపున తనను వేదిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ఏపీలో కూటమి పాలనలో మహిళల రక్షణ ప్రశ్నార్థకం అయ్యిందని ఆమె ఫైర్ అయ్యారు.

అవును... వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపిక చేసినప్పటి నుంచీ టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయని.. టీడీపీ అధికారిక గ్రూపుల్లోనూ తన గురించి అత్యంత అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఇదే క్రమంలో... సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తనపై పోస్టులు పెట్టారని.. తన ఫోటోలను ఫేక్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేశారని ఆరోపిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించిన శ్యామల.. సినిమాల్లో పనిచేసిన వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా అని అడిగారు!

సినీ పరిశ్రమ నుంచి వస్తే అంత చులకనగా ఎందుకు చూస్తున్నారని.. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ సినిమా నటుడు కాదా అని ప్రశ్నించారు. అనంతరం... చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లు సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదా.. జయప్రదలాంటి మహిళలు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి టీడీపీలో పనిచేయలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక.. తనకు రాజకీయాలు ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారని.. తనకు రాజకీయాలు ఎందుకనేది.. వారందరికీ త్వరలోనే తెలుస్తుందని.. మమ్మల్ని మానసికంగా ఎంత దెబ్బ తీయాలని అనుకున్నా.. తాము వైసీపీ తరుపున పెద్ద ఎత్తున ఉద్య్మం చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే... అసలైన మహిళా శక్తి ఏమిటో త్వరలో చూపిస్తానని శ్యామల ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Tags:    
  • Anchorshyamala 
  • Pawankalyan 
  • Chiranjeevi 
  • Appolitics 
  • Balakrishna 
  • Apgovernment 
  • Shyamala 
  • YSRCP 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS