అంబటి కుమార్తెకు- మమతా బెనర్జీకి లింక్ పెట్టారు

మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎపిసోడ్ లో కొత్త విషయం ఏంటి అంటే ఆయన పెద్ద కుమార్తె మౌనిక. ఆమె అచ్చం తండ్రి మాదిరిగానే బిగ్ సౌండ్ చేస్తూ అంబటి జైలులో ఉన్నన్ని రోజులీ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.;

Update: 2026-02-24 03:16 GMT

మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎపిసోడ్ లో కొత్త విషయం ఏంటి అంటే ఆయన పెద్ద కుమార్తె మౌనిక. ఆమె అచ్చం తండ్రి మాదిరిగానే బిగ్ సౌండ్ చేస్తూ అంబటి జైలులో ఉన్నన్ని రోజులీ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. కూటమి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఒక విధంగా చూస్తే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా ఎంతో మంది వైసీపీ నేతల కన్నా బాగా మాట్లాడారు అనిపించుకున్నారు. ఆమెకు మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉందని చాలా మంది అంటున్నారు కూడా.

అంబటి రియాక్షన్ అలా :

అయితే జైలు నుంచి విడుదలై వచ్చిన అంబటి రాంబాబు తన కుమార్తెల విషయం గర్వంగా ఉంది అని అన్నారు. తనకు కొడుకులు లేరు అన్న లోటు తీర్చారు అన్నారు. తన కంఠం జైలులో ఉన్నా కుమార్తె రూపంలో మారుమోగింది అన్నారు. ఇక మౌనిక రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లో కొనసాగుతున్నారు కదా అని మాత్రమే అన్నారు. ఆపైన పెద్దగా వ్యాఖ్యానించలేదు. మరి అంబటి ఆలోచనలు ఏమిటి అన్నది పెద్దగా బయటపడలేదు కానీ వైసీపీ నేతలు చాలా మంది అయితే మౌనికనే ముందుకు తీసుకుని రావాలని కోరుతున్నారు

ముద్రగడ వ్యాఖ్యలు :

జైలు నుంచి ఇంటికి చేరుకున్న అంబటి రాంబాబుని పరామర్శించేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటిని చూసేందుకు రాలేదని పులిబిడ్డను చూసేందుకు వచ్చాను అన్నారు. అంబటి కుమార్తె అద్భుతంగా మాట్లాడిందని ధీటుగా వ్యవహరించింది అని ముద్రగడ కొనియాడారు. ఆ అమ్మాయికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. మమతా బెనర్జీ మాదిరిగా పోరాట పటిమ ఉన్న ఆమె అంతటి స్థాయికి చేరుకోవాలని ముద్రగడ దీవించారు. అంటే మమతా బెనర్జీ మాదిరిగా సీఎం స్థాయికి చేరాలని ఆయన అన్నారని అంటున్న వారూ ఉన్నారు.

వారసురాలికే ప్లస్ :

ఇక అంబటి రాంబాబు మొదటి నుంచి వైసీపీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన విధేయతతోనే వ్యవహరిస్తున్నారు. దానికి గానూ వైసీపీ కూడా ఆయనకు తక్కువ ఏమీ చేయలేదు, మూడు సార్లు వరసగా పార్టీ టికెట్ ఇచ్చింది. ఒకసారి మంత్రి పదవి ఇచ్చి కీలకమైన జలవనరుల శాఖను అప్పగించింది. మరో వైపు అంబటికి గుంటూరు పశ్చిమ సీటు ఇంచార్జిగా నియమించారు.మొదట్లో పెద్దగా ఇష్టపడకపోయినా ఆయన ఈ ఏడాది నుంచి అక్కడ తన దూకుడు పెంచారు. ఈసారి సంక్రాంతి సంబరాలను కూడా అక్కడే జరుపుకున్నారు. గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సడెన్ గా మౌనిక ఎంట్రీ ఇచ్చారు. దాంతో పాటు వైసీపీ నేతలు అంతా ఆమె వైపే చూస్తున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం ఆమెకే టికెట్ ఇస్తుందా అన్న చర్చ మొదలైంది. చూడాలి మరి అంబటి రాంబాబు రాజకీయ వారసత్వం ఎలా సాగుతుందో. వచ్చే ఎన్నికల నాటికి మౌనిక ఏ విధంగా ముందుకు వస్తుందో.

Tags:    

Similar News