జగన్ ను కలిసేందుకు ప్రయత్నించిన అఖిలప్రియ అరెస్ట్..!

ఈ సమయంలో జగన్ బస్సుయాత్ర ఆలగడ్డకు చేరే సరికి కీలక సంఘటన జరిగింది!

Update: 2024-03-28 09:22 GMT

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇప్పటికే 200 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించిన జగన్... "మేమంతా సిద్ధం" అంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బుధవారం ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రాంభమైంది. 21 రోజులపాటు సాగి.. ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఈ సమయంలో జగన్ బస్సుయాత్ర ఆలగడ్డకు చేరే సరికి కీలక సంఘటన జరిగింది!

అవును... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసేందుకు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ప్రయత్నించారు! దీంతో... అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది! ఈ సమయంలో అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... "మేమంతా సిద్ధం" పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు నంద్యాలలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది వైసీపీ. ఈ క్రమంలో సీఎం జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో ఆయనతో మాట్లాడాలని అఖిల ప్రియ బయలుదేరడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకొంది!

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి సొదరుడు రైతుల్ని వేధిస్తున్నారని.. సాగునీటీ విడుదల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అఖిల ప్రియ ఆరోపించారని తెలుస్తోంది. ఈ విషయాలపై జగన్ ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించినట్లు అఖిల ప్రియ చెబుతున్నారు! నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆమె ఆరోపించారు!

Read more!

ఈ సమయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు పోలీసులు అఖిల ప్రియను అనుమతించలేదు! ఈ క్రమంలో... ఇద్దరు రైతుల్ని సీఎం వద్దకు తీసుకుని వెళ్లడంతో.. వారు తమ కష్టాన్ని చెప్పుకున్నట్లు తెలుస్తుంది.

కాగా... 2014లో తల్లి శోభానాగిరెడ్డి మృతి చెందడంతో నాడు జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలప్రియ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే... 2014-19 కాలంలో వైసీపీ తరుపున గెలిచి టీడీపీ కండువా కప్పుకున్న 23 మందిలో భూమా అభిలప్రియ కూడా ఒకరు. టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు!

Tags:    

Similar News