• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరో విషాదం... ఆటో డ్రైవర్...

మరో విషాదం... ఆటో డ్రైవర్ కుమార్తె ఫస్ట్ & లాస్ట్ ఫ్లైట్ జర్నీ!

| గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-14 10:39 GMT

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. పిల్లలను చూడాలని బయలుదేరిన తల్లి తండ్రులు, భర్తతో కలిసి జీవించాలనే కోటి ఆశలతో విమానం ఎక్కిన నవ వధువు, ఉన్నత శిఖరాలను అదిరోహించాలనుకున్న యువకులు ఇలా ఎందరో.. క్షణాల్లో మృతుఒడికి చేరుకున్నారు.

ఇదే సమయంలో.. చిన్న పిల్లలను లండన్ లో వదిలి, భార్య చివరి కోరిక తీర్చడానికని వచ్చి అనంత లోకాల్లో కలిసి పోయిన వ్యక్తి ఒకరైతే... ఫ్యామిలీతో కలిసి లండన్ లో స్థిరపడాలనుకుని, ఎంతో ఆనందంగా తన భర్య, పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ జ్ఞాపకాలను సెల్ఫీ రూపంలో బంధించి, అనంతరం గాల్లో కలిసిపోయిన ఫ్యామిలీ ఒకరు.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... విమానంలో ఉన్న 241 మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. గుండెలు పిండేసే విషాద కథ! ఈ క్రమంలో తన కుమార్తే జీవితం బాగుండాలని, ఉన్నత చదువులు చదవాలని, ఉజ్వల భవిష్యత్తు పొందాలని కలలుగన్న ఓ ఆటో డ్రైవర్.. తన కుమార్తె చదువుల కోసం ఎన్నో అప్పులు చేసి ఆమెను లండన్ పంపించాలనుకున్నాడు. ఆమె కూడా ఆ విమానంలోని మృతుల్లో ఒకరు.

అవును... ఎయిరిండియా విమానం ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో పాయల్ ఖాతిక్ ఒకరు. ఆమె ఓ ఆటో డ్రైవర్ కుమార్తె. ఆమె చదువుల కోసం ఎన్నో అప్పులు చేసిన తండ్రి.. ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం లండన్ పంపాలనుకున్నారు. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ విమానంలో ఆమె ఉన్నారు. తాజాగా ఈ విషయాలను ఆమె బంధువు వివరించారు.

ఇందులో భాగంగా... పాయల్ ఖాతిక్ ఎయిరిండియా విమానంలో ఉందని.. ఆమె తమ బంధువు సురేష్ ఖాతిక్ కుమార్తె అని.. ఆమెకు వీడ్కోలు చెప్పడానికి తామంతా వెళ్లామని తెలిపారు. అయితే.. ఆ విమాన ప్రమాదం గురించి విన్న అనంతరం తామంతా అహ్మదాబాద్ వెళ్లామని.. తమ డీఎన్ఏ శాంపుల్స్ ఇచ్చామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ప్రస్థావించారు. ఇందులో భాగంగా.. పాయల్ తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారని, తన కుమార్తె చదువుల కోసం, లండన్ పంపించడం కోసం కుటుంబం ఎన్నో అప్పులు చేసిందని వెళ్లడించారు. ఎంతో గొప్ప భవిష్యత్తును తమ కుమార్తె కలిగి ఉంటుందని ఆ కుటుంబం భావించిందని.. అయితే ఆమె తాజా విమానప్రమాదంలో మరణించిందని తెలిపారు.

Tags:    
  • AhmedabadPlaneCrash 
  • AirIndiaTragedy 
  • PayalKhathik 
  • 241LivesLost 
  • FlightAITragedy 
  • DreamsShattered 
  • HumanStories 
  • HeartbreakingLoss 
  • PlaneCrashIndia 
  • AirIndiaCrash2025 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS