AK47.. పడిన హైప్‌ను లేపుతున్న తమన్

దసరా సెలవుల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడబోతున్నామని ఎన్నో ఆశలతో ఉన్న ప్రేక్షకులందరినీ తీవ్ర నిరాశకు గురి చేసిందీ చిత్ర బృందం.

Update: 2026-10-07 09:38 GMT

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈపాటికి ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంచ్ అయిపోయి ఉండాలి. ఇంకొన్ని గంటల్లో బుకింగ్స్ మొదలవుతుండాలి. కానీ ఈ నెల 9న రావాల్సిన సినిమాను అనూహ్యంగా వాయిదా వేసేయడంతో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులందరూ అవాక్కయ్యారు.

దసరా సెలవుల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడబోతున్నామని ఎన్నో ఆశలతో ఉన్న ప్రేక్షకులందరినీ తీవ్ర నిరాశకు గురి చేసిందీ చిత్ర బృందం. అందుకే వాయిదా ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెలుగు నెటిజన్లు చాలా ఆగ్రహంతో కనిపిస్తున్నారు. నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మీద కూడా తమ కోపాన్ని చూపిస్తున్నారు. సినిమా మరోసారి వాయిదా పడడం వల్ల దానికి హైప్ కూడా కొంచెం తగ్గిందన్నది వాస్తవం.

ఐతే ఈ హైప్‌ను తిరిగి పెంచడానికి సంగీత దర్శకుడు తమన్ పూనుకున్నాడు. సినిమా ఆలస్యం కావడంలో తమన్ పాత్ర కూడా ఉన్నట్లుగా నిర్మాత నాగవంశీ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజీఎం, రెండు పాటల పని మిగిలి ఉన్నట్లు అతను చెప్పాడు. ఐతే తమన్ తాజాగా సినిమా రీరికార్డింగ్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ఈ పని చాలా స్పీడుగా నడుస్తోందని.. రికార్డింగ్ స్టూడియో నుంచి ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అంతే కాక ఈ సినిమాతో సిక్సర్ కొట్టబోతున్నట్లు కూడా ఒక కామెంట్ పెట్టాడు. ఈ పోస్టులో మరో విశేషం ఏంటంటే.. ‘ఆదర్శ కుటుంబం’ ఈ నెలలోనే రిలీజవుతుందని తమన్ హింట్ ఇవ్వడం. డేట్ చెప్పకుండా 10వ నెలలోనే సినిమా విడుదలవుతుందని తమన్ చెప్పకనే చెప్పాడు. దీంతో దసరా సీజన్ ముగిశాక అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల కావవచ్చనే అంచనాకు వస్తున్నారు వెంకీ అభిమానులు. తమన్ పని ముగియగానే విడుదల తేదీని టీం ఖరారు చేసే అవకాశముంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటించిన ఈ చిత్రంలో కామెడీతో పాటు క్రైమ్, యాక్షన్ ఎలిమెంట్స్ కీలకంగా ఉండబోతున్నట్లు త్రివిక్రమ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News