• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ రాజీనామా చేయాలట......

మోడీ రాజీనామా చేయాలట... రాహుల్ ని మించిన ఎంపీ

| ఇక ఎంపీలుగా గెలిచిన బీజేపీకి చెందిన 240 మంది కూడా ఎన్నికల సంఘం సమర్పించిన తప్పుడు జాబితా కారణంగానే అని భారీ నిందనే వేశారు.

By - Satya P
Update: 2025-08-13 03:00 GMT

ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉన్నఫళంగా రాజీనామా చేయాలట. ఈ డిమాండ్ చేసింది కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే కాదు. తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీ నుంచి వచ్చింది ఈ డిమాండ్. మోడీ ఎందుకు రాజీనామా చేయాలి అంటే 2024 ఎన్నికలు సాఫీగా సవ్యంగా సాగలేదని ఓట్ల తారుమారు ఓట్ల చోరీ కారణంగానే జరిగాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఆయన వల్లిస్తున్నారు. ఆ ఓట్లతో గెలిచిన గెలుపు సవ్యమైనది కాదని తర్కం కూడా చెబుతున్నారు.

ఆ ఎన్నికల్లో ఓటు వేయరాదు:

ఇక ఎంపీలుగా గెలిచిన బీజేపీకి చెందిన 240 మంది కూడా ఎన్నికల సంఘం సమర్పించిన తప్పుడు జాబితా కారణంగానే అని భారీ నిందనే వేశారు. అందుకే వారి ఎన్నిక కూడా చట్టబద్ధం కాదని వాదిస్తున్నారు. ఇక వీరంతా చేయాల్సింది రాజీనామాలే అని ఆయన అంటున్నారు. మోడీ ప్రభుత్వానికి కూడా ఎలాంటి చట్టబద్ధత లేదని మరో బాంబు కూడా పేల్చారు. ఈ ఎంపీలే రాబోయే రోజులలో రాష్ట్రపతి ఉప రాష్ట్రపతిలను కూడా ఎన్నుకోబోతారు కాబట్టి ముందుగా రాజీనామాలు చేయాల్సిందే అని ఆయన గట్టిగా చెబుతున్నారు. రాజీనామాలు చేయకపోతే ఇబ్బందే అని అంటున్నారు.

బీహార్ తో ముడిపెట్టి మరీ :

బీహార్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది అని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో దేశంలోని గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సరైనది అని ఎలా ఎన్నికల సంఘం చెబుతుందని ప్రశ్నించారు. దేశంలో చట్టం అన్ని చోట్లా వర్తిస్తుందని రెండు చట్టాలు ఉండవని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విధానం అంతకంటే ఉండదని అంటున్నారు. అందువల్ల దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించాలని కోరుతున్నారు. అంతే కాదు బీహార్ ఎన్నికల్లో పాత ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తే బీజేపీ ఓటమి పాలు అవుతుందని భావించే ఈ విధంగా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

ఈసీ మీద ఫైర్ :

కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబులు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. జవాబులు చెప్పి సందేహాలు తీర్చాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా మౌనం పాటిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి భయపడినట్లుగానే అర్ధం చేసుకోవాలని ఆయన అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక అభిషేక్ బెనర్జీ ఏకంగా ప్రధాని మోడీ ఆయన కేబినెట్ ని రాజీనామా చేయమని అంటున్నారు. ఆ తరువాత లోక్ సభను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ముదురుతున్న వివాదం :

రాహుల్ గాంధీ ఆరోపణలను సమర్థిస్తూ ఇండియా కూటమి మిత్రులు అంతా గళం విప్పుతున్నారు. మోడీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఈ ఫలితాలు సరైనవి కావు అని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధతనే ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా ఇది ఇబ్బందికరంగా మారుతున్న నేపధ్యం ఉంది. మరి దీని మీద ఈసీ కానీ కేంద్ర ప్రభుత్వం కానె ఎ ఏ విధంగా జవాబు చెబుతుంది ఏ విధంగా విపక్షాల రచ్చకు ఎండ్ కార్డు పడుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags:    
  • AbhishekBanerjee 
  • VoteChori 
  • VoterRollControversy 
  • PMResign 
  • FreshElections 
  • TMC 
  • ECI 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS