మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది.. తేదీ ఇదే.. అంతర్జాతీయ సర్వే హెచ్చరిక!
ప్రస్తుతం ప్రపంచం అంతా చాలా టెన్షన్ గా ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏమాత్రం బాగాలేవు.;
ప్రస్తుతం ప్రపంచం అంతా చాలా టెన్షన్ గా ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏమాత్రం బాగాలేవు. మొన్నటి పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత అయితే యుద్ధం వస్తుందేమో అనేంత సీరియస్‌గా ఉంది పరిస్థితి. రెండు దేశాల మధ్యే ఇలా ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇంకెంత దారుణంగా ఉంటుందో అని అందరూ భయపడుతున్నారు. తాజాగా వచ్చిన ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ అయితే ఈ భయానికి ఒక టైమ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం కేవలం భారత్-పాకిస్తానే కాదు, అమెరికా, రష్యా, యూరప్ దేశాలు కూడా ఒక పెద్ద గొడవ దిశగా వెళ్తున్నాయి. దీని చివర్లో ఒక భయంకరమైన యుద్ధం రావొచ్చట. అదే మూడో ప్రపంచ యుద్ధం.
ఇంకా భయానకమైన విషయం ఏంటంటే ఈ యుద్ధం కేవలం తుపాకులతోనే కాదు, అణుబాంబుల విధ్వంసంతో కూడా రావచ్చని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 80 ఏళ్లు దాటింది. మళ్లీ అలాంటి అంతకు మించిన భయం ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ వస్తోంది. YouGov అనే సంస్థ చేసిన సర్వేలో చాలా విషయాలు బయటపడ్డాయి. ప్రజలు కేవలం అణు యుద్ధం వస్తుందని మాత్రమే భయపడట్లేదు, తమ దేశాల సైనిక సన్నద్ధత మీద, ప్రపంచ భాగస్వాముల మీద కూడా నమ్మకం లేదని అంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన విధానాన్ని ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చి చూస్తూ నాజీలు చేసిన నేరాలు మళ్లీ ఎక్కడైనా రిపీట్ కావొచ్చని చాలామంది నమ్ముతున్నారు.
ప్రధానంగా రిపోర్ట్‌లో చెప్పిన విషయాలు:
అణు విధ్వంసం జరిగే ప్రమాదం: బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో 41శాతం నుంచి 55శాతం మంది వచ్చే పదేళ్లలో మూడో ప్రపంచ యుద్ధం రావచ్చని లేదా వచ్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు. అమెరికాలో కూడా 45శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 68శాతం నుంచి 76శాతం మంది ఈ యుద్ధం అణ్వాయుధాలతో జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, 57శాతం నుంచి 73శాతం మంది 1939-45లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ప్రపంచంలో చాలామంది చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అమెరికా మీద అనుమానాలు.. రష్యానే పెద్ద ముప్పు, : యూరప్, అమెరికాలో చాలామంది మూడో ప్రపంచ యుద్ధానికి రష్యానే ప్రధాన కారణం అవుతుందని అనుకుంటున్నారు. పశ్చిమ యూరప్‌లో 72శాతం నుంచి 82శాతం మంది, అమెరికాలో 69శాతం మంది రష్యానే పెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అమెరికా విషయంలో కూడా యూరప్‌లోని చాలామంది అనుమానంగా ఉన్నారు. స్పెయిన్‌లోని 58శాతం, జర్మనీలోని 55శాతం, ఫ్రాన్స్‌లోని 53శాతం మంది అమెరికాతో పెరుగుతున్న టెన్షన్లు యూరప్‌లో శాంతికి పెద్ద ముప్పు అని నమ్ముతున్నారు.
యుద్ధం వస్తే మేం పాల్గొంటాం..కానీ మా సైన్యం సిద్ధంగా లేదు: ఇటలీ నుంచి యూకే వరకు చాలామంది ఒకవేళ యుద్ధం వస్తే తమ దేశం అందులో తప్పకుండా పాల్గొంటుందని (66శాతం నుంచి 89శాతం మంది ఇలా చెప్పారు) అనుకుంటున్నారు. కానీ తమ సైన్యాల మీద మాత్రం అంత నమ్మకం లేదు. ఇటలీలో కేవలం 16శాతం, ఫ్రాన్స్‌లో 44శాతం మంది మాత్రమే తమ సైన్యం తమను కాపాడుతుందని నమ్ముతున్నారు. దీనికి భిన్నంగా, 71శాతం మంది అమెరికన్లు తమ సైన్యం మీద పూర్తి నమ్మకం ఉంచారు.
చరిత్ర పాఠాలు చెప్పడం కూడా ముఖ్యం: ఫ్రాన్స్‌లో 72శాతం, జర్మనీలో 70శాతం, బ్రిటన్‌లో 66శాతం మంది రెండో ప్రపంచ యుద్ధం గురించి తమకు బాగా తెలుసని చెప్పారు. స్పెయిన్‌లో ఈ సంఖ్య చాలా తక్కువగా (40శాతం) ఉంది. ఫ్రాన్స్‌లో 77శాతం మందికి స్కూళ్లలో రెండో ప్రపంచ యుద్ధం గురించి పాఠాలు చెప్పగా, బ్రిటన్‌లో కేవలం 48శాతం, స్పెయిన్‌లో 34శాతం మందికే చెప్పారు. 80శాతం కంటే ఎక్కువ మంది రెండో ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ముఖ్యమైనదని, దాని గురించి స్కూళ్లలో తప్పకుండా చెప్పాలని అభిప్రాయపడ్డారు.
నాజీల లాంటి నేరాలు మళ్లీ జరగవచ్చా?: అమెరికాలో 52శాతం మంది తమ దేశంలో మళ్లీ నాజీ జర్మనీలో జరిగిన లాంటి నేరాలు జరగవచ్చని భయపడుతున్నారు. యూరప్‌లో కూడా స్పెయిన్‌లో 31శాతం నుంచి జర్మనీలో 50శాతం వరకు ప్రజలు ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. 59శాతం మంది ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవచ్చని భావిస్తున్నారు. చాలా దేశాల్లో (40శాతం నుంచి 52శాతం) రెండో ప్రపంచ యుద్ధం గెలవడంలో అమెరికానే ఎక్కువగా సహాయం చేసిందని ప్రజలు నమ్ముతున్నారు. 17శాతం నుంచి 28శాతం మంది సోవియట్ యూనియన్‌కు ఆ ఘనత ఇచ్చారు. యూకేలో 41శాతం మంది బ్రిటన్‌దే ముఖ్య పాత్ర అని చెప్పగా, మిగిలిన దేశాల్లో ఈ సంఖ్య 5శాతం నుంచి 11శాతం మాత్రమే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతిని కాపాడటంలో నాటోదే ముఖ్య పాత్ర అని చాలామంది (52శాతం నుంచి 66శాతం) నమ్ముతున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా చాలామందికి ముఖ్యమైన సంస్థగా అనిపించింది. యూరోపియన్ యూనియన్‌ను కూడా 45శాతం నుంచి 56శాతం మంది శాంతిని కాపాడే సంస్థగా భావిస్తున్నారు.
మొత్తానికి ఈ రిపోర్ట్ చూస్తే ప్రపంచం నిజంగానే ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని అర్థమవుతోంది. భారత్-పాక్ టెన్షన్లు ఒకవైపు, అమెరికా-రష్యా మధ్య వైరం మరోవైపు, యూరప్‌లో నెలకొన్న భయాలు ఇంకోవైపు.. ఇవన్నీ కలిసి మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తేనే భయమేస్తోంది. అణుబాంబుల ప్రస్తావన మరింత కలవరపెడుతోంది. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదని సామాన్యులు కోరుకుంటున్నారు.