హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాక్.. స్విగ్గీ అవార్డ్స్‌లో బెస్ట్ బిర్యానీ ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇండియాలో అసలు సిసలైన బిర్యానీ ఏది? హైదరాబాద్ బిర్యానీనా? లేక కోల్‌కతానా ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఫుడ్ లవర్స్‌కు స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2025 ఒక కొత్త విజేతను పరిచయం చేసింది;
ఏళ్ల తరబడి సాగుతున్న బిర్యానీ పంచాయితీకి స్విగ్గీ ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఇండియాలో అసలు సిసలైన బిర్యానీ ఏది? హైదరాబాద్ బిర్యానీనా? లేక కోల్‌కతానా ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఫుడ్ లవర్స్‌కు స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2025 ఒక కొత్త విజేతను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా జరిగిన భారీ ఓటింగ్‌లో ఢిల్లీకి చెందిన బిక్కగణే బిర్యానీ (Bikkgane Biryani) 'బెస్ట్ బిర్యానీ'గా అవతరించింది. ఏకంగా 60 లక్షల మంది ఫుడ్ లవర్స్ తమ ఓటు వేసి మరీ ఈ బిర్యానీని గెలిపించారు. స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ అంటే కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. క్వాలిటీ, కస్టమర్ల సంతృప్తి వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. డెలివరీ అయినా, డైనింగ్ అయినా సరే.. ప్రతిసారీ ఒకే రుచిని అందిస్తూ అందరినీ మెప్పించిన రెస్టారెంట్లకు ఈ గౌరవం దక్కింది.
బిర్యానీతో పాటు ఇతర కేటగిరీల్లో విజేతలు వీరే
స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఇతర రుచులు కూడా కొన్ని వెల్లడయ్యాయి. నార్త్ ఇండియన్ వంటకాల్లో చుల్హా చౌకీ దా డాబా, సౌత్ ఇండియన్‌లో A2B - అడయార్ ఆనంద భవన్, ఫాస్ట్ ఫుడ్‌లో డొమినోస్ పిజ్జా (పిజ్జా), మెక్‌డొనాల్డ్స్ (బర్గర్), చైనీస్‌లో చౌమాన్, డెజర్ట్స్‌లో థియోబ్రోమా టాప్‌లో నిలిచాయి. ఇక ఫాస్ట్ డెలివరీకి KFC, బెస్ట్ ఐస్ క్రీమ్‌కు బాస్కిన్ రాబిన్స్ అవార్డులు గెలుచుకున్నాయి.
డైనింగ్ విషయానికొస్తే.. బెస్ట్ కేఫ్‌గా రోస్టరీ కాఫీ హౌస్, రొమాంటిక్ ప్లేస్‌గా మైకోస్ క్రాఫ్ట్ కిచెన్ అండ్ బార్, ఔట్‌డోర్ డైనింగ్‌కు టిక్ టిక్, బార్స్ అండ్ లాంజ్‌లో వేర్‌హౌస్ బార్ అండ్ కిచెన్, ప్యూర్ వెజ్‌లో తాన్-సుఖ్ బై కన్హా, ఇన్‌స్టాగ్రామ్ ఫేవరెట్‌గా జుగ్ను నిలిచాయి. నార్త్ ఇండియన్ డైనింగ్‌లో శాండోజ్, బఫేలో బార్బెక్యూ నేషన్, సౌత్ ఇండియన్ డైనింగ్‌లో దోసక - టేస్ట్ ఆఫ్ సౌత్ బెస్ట్ అనిపించుకున్నాయి.
నగరాల వారీగా ఫేవరెట్స్
స్విగ్గీ కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా నగరాల వారీగా కూడా ప్రజల అభిమాన రుచులను గుర్తించింది. బెంగళూరులో ట్రఫల్స్, నందన ప్యాలెస్, నమస్తే డెలివరీలోనూ, BLR బ్రూయింగ్ కో, ఐరన్‌హిల్ డైనింగ్‌లోనూ టాప్. హైదరాబాద్‌లో బిర్యానీకి పిస్తా హౌస్, బఫేలకు ఫ్లెచాజో ఫేవరెట్‌గా నిలిచాయి. ముంబైలో మెరాకి, జిమిస్ బర్గర్, చేతక్ స్వీట్ పాయింట్ డెలివరీలోనూ, ముల్క్, క్రీమ్ సెంటర్ డైనింగ్‌లోనూ బెస్ట్. చెన్నైలో నందన ప్యాలెస్, A2B డెలివరీలోనూ, పామ్‌షోర్, ది లివింగ్ రూమ్ డైనింగ్‌లోనూ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఢిల్లీలో బల్లోచ్, పెంట్‌హౌస్ డ్యూటీ ఫ్రీ డైనింగ్ లిస్ట్‌లో ఉన్నాయి.