ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇలా కూడా వాడేస్తున్నారా బాబు..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో ప్రపంచంలోని చాలా లెక్కలు మారిపోతున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-01-09 04:45 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో ప్రపంచంలోని చాలా లెక్కలు మారిపోతున్నాయనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది క్రియేటివిటీ, ఫోటో ఎడిటింగ్, వీడియో క్రియేషన్ కోసం ఒక సాధనం మాత్రమే కాదు.. దాని దుర్వినియోగం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారమ్ లు, ఇ-కామర్స్ కంపెనీలకు సరికొత్త సమస్యలు ఇప్పుడు ఏఐ ఒక సాధానంగా మారిందని అంటున్నారు.

అవును... గత కొంతకాలంగా ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారమ్ లకు, ఇ-కామర్స్ కంపెనీలకు ఆదరణ అవిరామంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది కస్టమర్లు ఏఐ-జనరేటెడ్ ఫోటోలను ఉపయోగించి.. వారికి డెలివరీ చేయబడిన వస్తువులను చెడిపోయినట్లు, దెబ్బతిన్నట్లు.. ఆహారంలో అయితే పురుగులు, వెంట్రుకలు మొదలైనవి ఉన్నట్లు ఫోటోలు ఎడిట్ చేసి, రీఫండ్ అమౌంట్ పొందుతున్నరనే విషయం ఇటీవల తమకు పెద్ద సమస్యగా మారిందని సంస్థలు వాపోతోన్న పరిస్థితి.

ఈ సందర్భంగా స్పందించిన జొమాటో సీఈఓ దీపికర్ గోయల్... జొమాటో నుంచి డబ్బులు తిరిగి పొందేందుకు ప్రజలు ప్రత్యేకమైన చిత్రాలను రూపొందించడానికి ఏఐను ఉపయోగించడం ప్రారంభించారని తెలిపారు. డెలివరీ ఫుడ్ ప్యాకెట్స్ లో కీటకాలు, జుట్టు, గోర్లు మొదలైనవి ఉన్నట్లు.. తాజా పండ్లు కుళ్లిపోయినట్లు, పూర్తిగా పాడైపోయినట్లు ఉన్న ఫోటోలను జోడించడానికి ఏఐని ఉపయోగిస్తున్నారని, తద్వారా డబ్బులు వాపస్ అడుగుతున్నారని తెలిపారు.

ఈ సమస్య భారత్ కే పరిమితం కాదు!:

ఇలా ఏఐతో ఫోటోలు క్రియేట్ చేసి డబ్బులు వాపస్ అడుగుతున్న కస్టమర్ల సమస్య భారత్ లోనే కాదని.. చైనాతో పాటు పలు ఇతర ప్రధాన ఇ-కామర్స్ కేంద్రాలలో కూడా మార్కెట్లలో వ్యాపిస్తోందని నివేదికలు సూచిస్తున్న పరిస్థితి! దీనివల్ల నిజమైన ఫిర్యాదులు ఏవో, నకిలీ ఫిర్యాదులేవో తెలుసుకోవడం కాస్త కష్టమవుతోందని.. ఈ రెండిటినీ వేరు చేసి వాపస్ లు పంపడం సమస్యగా మారుతోందని అంటున్నారు.

ఎక్కువగా వినిపిస్తున్న నకిలీ ఫిర్యాదులు..!:

ఈ నేపథ్యంలో ఎక్కువగా కనిపిస్తున్న ఫిర్యాదుల విషయాలను ఫుడ్ డెలివరీ ఏజెంట్లు గుర్తించారని చెబుతున్నాయి కంపెనీలు! ఇందులో భాగంగా...

తాజా కూరగాయలపై కృత్రిమ మచ్చలు కనిపించాయి.

స్వీట్లు కరిగిపోయాయి లేదా చెడువాసన వస్తున్నాయి.

స్నాక్ ప్యాక్‌ లు సగం ఖాళీగా ఉన్నాయి.. లేదా ఫ్యాక్ చిరిగి స్నాక్స్ మొత్తం మెత్తగా అయిపోయాయి.

అయితే... అంతర్గత తనిఖీలలో మాత్రం అసలు డెలివరీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉందని తేలిన ఘటనలే గరిష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో.. ఏఐ ని ఇలా కూడా వాడేస్తున్నారా బాబు అనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

Tags:    

Similar News