ఒంటరికి నో ఎంట్రీ.. రెస్టారెంట్ బోర్డు భారీగా వైరల్
హోటల్ ఇండస్ట్రీ.. అందునా సర్వీస్ సెక్టార్ లో ఏ కస్టమర్ ను వదులుకోవటానికి అస్సలు ఇష్టపడరు.;
హోటల్ ఇండస్ట్రీ.. అందునా సర్వీస్ సెక్టార్ లో ఏ కస్టమర్ ను వదులుకోవటానికి అస్సలు ఇష్టపడరు. కానీ.. ఇప్పుడు చెప్పే రెస్టారెంట్ రోటీన్ కు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత సంచలనమైతే అంతలా పాపులర్ కావాలని భావిస్తున్నారో ఏమో కానీ.. ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది? సింగిల్ గా వచ్చే వారి విషయంలో తమ ట్రీట్ మెంట్ ఏమిటన్న విషయాన్ని సూటిగా.. సుత్తి కొట్టకుండా చెప్పేశారు.
దక్షిణ కొరియా జియోలా ప్రావిన్స్ లో ఉన్న యోసు సిటీలో ఒక నూడిల్ రెస్టారెంట్ ఉంది. దీని బయట ఒక బోర్డును పెట్టారు. ఇది కాస్తా విపరీతంగావైరల్ అవుతోంది. వివాదంగా మారి చర్చకు తెర తీసింది. ఇంతకూ ఆ రెస్టారెంట్ బయట ఉన్న బోర్డులోని వివరాల ప్రకారం.. ‘‘రెండు ఐటమ్స్ ఆర్డర్ చేయండి. రెండు ఐటమ్స్ తినండి. మీరు ఒంటరిగా ఉంటే మీ స్నేహితులను పిలవండి.తర్వాత మీ భార్యతో రెస్టారెంట్ కు రండి. ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు. దయచేసి ఒంటరిగా రావొద్దు’’ అంటూ రాసి ఉన్నాయి.
రెస్టారెంట్ బయట పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మద్దతు ఇస్తుంటే. మరికొందరు తిరస్కరిస్తున్నారు. ఒంటరిగా ఉండటం శాపం అన్నట్లుగా ఈ బోర్డులు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి.. కస్టమర్లకు విలువ ఇవ్వటం లేదని పేర్కొనగా.. మరికొదరు ఈ విధానాన్ని సమర్థించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏ వ్యాపారమైనా.. సదరు యజమాని ఏ నిర్ణయం తీసుకుంటారన్నది అతని ఇష్టమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎంతైనా యజమాని యజమానే కదా.