• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకుడిగా స్టార్‌...

దర్శకుడిగా స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

| సినిమా ఇండస్ట్రీలో ఇళయరాజా తనయుడిగా అడుగు పెట్టిన యువన్ శంకర్ రాజా తక్కువ సమయంలోనే తానేంటో అంతా గుర్తించేలా చేశాడు.

By - Tupaki Desk
Update: 2024-10-17 17:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఇళయరాజా తనయుడిగా అడుగు పెట్టిన యువన్ శంకర్ రాజా తక్కువ సమయంలోనే తానేంటో అంతా గుర్తించేలా చేశాడు. సంగీత దర్శకుడిగా కోలీవుడ్‌, టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాలకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఏఆర్ రహమాన్‌ స్థాయి అంటూ ఒకానొక సమయంలో ప్రశంసలు దక్కించుకున్న యువన్ శంకర్ రాజా ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నాడు. సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు దర్శకుడిగా అదీ తనకు అత్యంత సన్నిహితుడు అయిన శింబు హీరోగా సినిమా తీయబోతున్నాడు.

యువన్ శంకర్ రాజా గతంలో నిర్మాతగా ప్యార్‌ ప్రేమ కాదల్‌ సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత సైతం పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న యువన్ శంకర్ రాజా ఇప్పుడు దర్శకుడిగా సినిమాను చేయబోతున్నాడు. శింబు హీరోగా నటించబోతున్న ఆ సినిమాతో దర్శకుడిగా యువన్ శంకర్ రాజా తన ప్రతిభను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న యువన్ శంకర్ రాజా ఇప్పుడు దర్శకుడిగా సినిమాను చేయడం ద్వారా మరోసారి తన ప్రతిభను కనబర్చే అవకాశాలు ఉన్నాయి. సంగీత దర్శకులు దర్శకులుగా మారడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. యువన్ శంకర్ రాజా ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాడో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యువన్‌ శంకర్‌ రాజా మాట్లాడుతూ సంగీతంపైనే కాకుండా కథలపైన వర్క్ చేస్తున్నట్లుగా రివీల్‌ చేశాడు. త్వరలోనే శింబు హీరోగా ఒక సినిమాను చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు. శింబు కు ఇప్పటివరకు చెప్పలేదని యువన్ అన్నారు. అయితే యువన్‌ శంకర్‌ రాజా తో శింబుకు చాలా మంచి స్నేహం ఉంది. అందుకే ఆయన ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వీరి కాంబో మూవీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

శింబు ఈ మధ్య కాలంలో హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైతం సినిమాలు చేస్తున్నాడు. కనుక యువన్‌ శంకర్ రాజా దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది.. హీరోగా కనిపిస్తాడా లేదంటే మరేదైనా ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్టింట జరుగుతున్న ఈ ప్రచారం పై శింబు ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన్ను ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. యువన్‌ శంకర్ రాజా దర్శకత్వంలో సినిమా చేయాలని మీకు ఉందా.. ఆయన దర్శకుడిగా సక్సెస్ అవుతాడని నమ్ముతున్నారా అంటూ శింబును పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి శింబు సమాధానం ఏంటో చూడాలి.

Tags:    
  • Yuvanshankarraja 
  • Ilayaraja 
  • Musicdirector 
  • Simbu 
  • Yuvanmusichits 
  • Kollywood 
  • Filmindustry 
  • Pyaarpremakadhal 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS