వరల్డ్ బాక్సాఫీస్ లెక్కలు.. టాప్-3లో భారత్

2023 పూర్తై 12రోజులు అయిపోయింది. గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక సూపర్ హిట్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి.

Update: 2024-01-12 08:18 GMT

2023 పూర్తై 12రోజులు అయిపోయింది. గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక సూపర్ హిట్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. 2024లో కూడా వరుస సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమాలు విడుదల కాగా.. త్వరలో బ్లాక్ బస్టర్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. తాాజాగా 2023 ప్రపంచ దేశాల బాక్సాఫీస్ లెక్కలు బయటకొచ్చాయి.

ఆ లిస్ట్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మూడో అత్యధిక బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది ఇండియా. అమెరికా/ కెనడా, చైనా దేశాల తర్వాత మూడో స్థానంలో భారత్ నిలిచింది. 1.5 బిలియన్ల డాలర్లను వసూలు చేసింది. 2022 కన్నా 30 శాతం వసూళ్లను అధికంగా సాధించింది. 2023లో మొత్తం వసూళ్లలో హిందీ బాక్సాఫీస్ 43 శాతం ఉంది.

అయితే సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా మొదలుకాకపోయిన ముందు.. ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో బీటౌన్.. 60-65 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రకారం 40 శాతం వసూళ్లను సాధించడమే గ్రేట్ అని చెప్పొచ్చు. కొవిడ్ మహమ్మారికి ముందు 2019లో హిందీ వెర్షన్ మార్కెట్ శాతం.. దాదాపు 45 శాతం ఉండేది. 2023లో హిందీ వెర్షన్ అప్పటి శాతాన్ని రిపీట్ చేసేందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు ఈ 40 శాతం వాటాను కూడా కొనసాగించడం హిందీ ఇండస్ట్రీకి కాస్త పెద్ద సవాలే. ఆల్ ఇండియా మార్కెట్ లో బాలీవుడ్ 40 శాతం కంటిన్యూ చేస్తే.. భారత్ బాక్సాఫీస్ మరింత పుంజుకుంటుంది. అయితే 2023లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికా/ కెనడా- 9.07 బిలియన్ డాలర్లు (75,300 కోట్లు)

చైనా- 7.71 బిలియన్ డాలర్లు (64,000 కోట్లు)

ఇండియా- 1.50 బిలియన్ డాలర్లు (12,400 కోట్లు)

జపాన్- 1.48 బిలియన్ డాలర్లు (12,275 కోట్లు)

యూకే, ఐర్లాండ్- 13 బిలియన్ డాలర్లు (11,290 కోట్లు)

జర్మనీ- 1.01 బిలియన్ డాలర్లు (8400 కోట్లు)

దక్షిణ కొరియా- 0.97 బిలియన్ డాలర్లు (8050 కోట్లు)

మెక్సికో- 0.94 బిలియన్ డాలర్లు (7800 కోట్లు)

ఆస్ట్రేలియా- 0.67 బిలియన్ డాలర్లు (5550 కోట్లు)

Tags:    

Similar News