• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేమ్ ఛేంజర్.. దిల్ రాజు...

గేమ్ ఛేంజర్.. దిల్ రాజు బిగ్ ప్లాన్ లో పవన్

| కాబట్టి తప్పకుండా సినిమా కంటెంట్ గట్టిగానే క్లిక్ అవుతుంది అని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-19 10:19 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఫాన్స్ అయితే గట్టిగానే ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాపై కొంత నెగిటివ్ వైబ్ ఏర్పడినప్పటికీ ఆ తర్వాత టీజర్ తో కొంత నమ్మకం అయితే కలిగింది దర్శకుడు శంకర్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ ఫైర్ అవ్వకూడదు అనేలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. ఇక దిల్ రాజు కూడా ఎంతో నమ్మకంతోనే ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మించాడు.

కాబట్టి తప్పకుండా సినిమా కంటెంట్ గట్టిగానే క్లిక్ అవుతుంది అని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడానికి మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక రామ్ చరణ్ తేజ్ ఈసారి మూడు భిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది.

ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా ఉండబోతోంది అని, ఆలోచింపజేసే విధంగా మంచి సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంలో ఫాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చేది ఎవరు అనే విషయంలో కూడా ఇదివరకే చాలా రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి.

లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారమైతే నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పిలవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అధికారాలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్లో కూడా పాల్గొనలేదు. ఆయన హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్స్ లో కూడా పెద్దగా పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ కోసం గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

అయితే పవన్ కళ్యాణ్ వీలునిబట్టి ఆయనకు అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా గోదావరి జిల్లాలోనే చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాడేపల్లి రాజముండ్రి కాకినాడ లాంటి ప్రాంతాలపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు నిజంగా పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం అంచనాల స్థాయి మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. మరి దిల్ రాజు ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Event 
  • Ramcharan 
  • Kiaraadvani 
  • Shankar 
  • Dilraju 
  • Pawankalyan 
  • DeputyCM 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS