• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత చేతిలో ఏంటది?

సమంత చేతిలో ఏంటది?

| త్వరలోనే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది.

By - Tupaki Desk
Update: 2024-08-20 12:56 GMT

స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నేళ్ల క్రితం మయోసైటిస్ బారినపడ్డ సామ్.. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అనారోగ్యం వల్ల ప్రాజెక్టులకు ఆచితూచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు కెరీర్ ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది ఆ సిరీస్.

వరుణ్ ధావణ్ సరసన సామ్ నటించిన ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సామ్ ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మా ఇంటి బంగారం పేరుతో మూవీని తన బర్త్ డే నాడు ప్రకటించింది. మరో వెబ్ సిరీస్ లో కూడా నటించనుంది. మొత్తానికి మెల్లగా మళ్లీ బిజీగా అవుదామని ట్రై చేస్తోంది సామ్.

అయితే సమంత రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. "ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. నా జీవితంలో స్పెషల్ డే. అప్డేట్ కోసం స్టేట్ ట్యూన్డ్" అంటూ స్టోరీ పెట్టింది. దీంతో సమంత ఏం చెప్పబోతుందన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సామ్ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే తన కొత్త సినిమా గురించి ఆమె చెబుతుందని కొందరంటుంటే.. మరికొందరు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయం ఏదైనా చెప్పబోతుందేమోనని అనుమానపడుతున్నారు.

అదే సమయంలో సమంత ఓ ఈవెంట్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో గ్రే కలర్ టీషర్ట్ వేసుకున్న బ్యూటీ.. చేతిలో ఏదో బాల్ తో కనిపించింది. డెనిమ్ జీన్, బ్లాక్ కలర్ స్పెక్ట్స్ తో రిలాక్స్ డ్ ఫిట్ గా అట్రాక్ట్ చేస్తోంది. నార్మల్ ఔట్ పిట్టే వేసుకున్నా.. స్పెషల్ గా కనిపిస్తోంది. తన టీ షర్ట్ పై ఉన్న లోగో క్లియర్ గా అర్థం కాకపోయినా.. సమ్ థింగ్ ఏదో ఈవెంట్ అని మాత్రం క్లారిటీ వస్తుంది. దీంతో మార్నింగ్ ఆమె పెట్టిన పోస్ట్, వైరల్ వీడియోను కంపేర్ చేసి చూస్తున్నారు.

ఇక కొద్దిరోజులుగా సమంత.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్‌ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఇద్దరూ స్పందించలేదు. రూమర్స్ తర్వాత సామ్ ఓ పోస్ట్ పెట్టినా.. డేటింగ్ గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. రాజ్ కూడా ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. దీంతో సమంత లేటెస్ట్ పోస్ట్ వెనుక ఉన్న అసలు కారణమేంటోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి సామ్ ఎప్పుడు ఏ అప్డేట్? ఎలాంటి అప్డేట్? ఇస్తుందో వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • WebSeries 
  • Citadel 
  • VarunDhawan 
  • Samantha 
  • Raj 
  • DK 
  • TralalaMovingPictures 
  • Samanthahealthproblems 
  • Illness 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS