అన్ని భాషల ఆర్టిస్టులు ఉంటే పాన్ ఇండియా మూవీ అవుతుందా? అసలు పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలి...

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు.

Update: 2026-09-22 08:00 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. నిజానికి అన్ని భాషల యాక్టర్స్ ని తీసుకొని సినిమాని చేసి దాన్ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి? అన్ని భాషల నటులు ఉన్నంత మాత్రాన అది పాన్ ఇండియా సినిమా అవుతుందా? కేవలం అక్కడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి ఆయా భాషల నటులను తీసుకుంటున్నారు తప్ప కాన్సెప్ట్ మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల నటులను తీసుకొని సినిమా చేసి ఆయా భాషల్లో మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం కాదు. టోటల్ ఇండియా వైడ్ గా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్ ని తీసుకొని దానిని సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తేనే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది... సినిమాలో చూపించే కోర్ ఎలిమెంట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది...

ఇప్పటివరకు ఎవరు ఎన్ని సినిమాలు చేశారనే విషయం పక్కన పెడితే, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండును బట్టి చూస్తే ప్రతి ఒక్కరు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసిన వారే తప్ప కాన్సెప్ట్ మీద పెద్దగా ఫోకస్ చేసినట్టుగా కనిపించడం లేదు. 'బాహుబలి' లాంటి సినిమాను పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చు... అలా ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో అట్రాక్ట్ చేయగలిగే కాన్సెప్ట్ తో వస్తే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుంది ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. తద్వారా సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి... ప్రస్తుతం ఇలాంటి కథలను రెడీ చేయడానికి మన దర్శకులు ఎక్కువ కష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాగా చెప్పుకునే ప్రతి సినిమా వెనక ఒక మంచి స్టోరీ ఉంటుంది.

కాన్సెప్ట్ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయి ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకునేలా ఉండే విధంగానే మన దర్శకులు ఆ కథలను డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది... పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన తెలుగు హీరోలు టాప్ రేంజ్ కి వెళ్లాలంటే రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పటివరకు మన వాళ్ళు గొప్ప విజయాలను సాధించిన ఘనత ఉంది. కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా అంతకు మించిన సక్సెస్ లను సాధిస్తేనే మన హీరోలకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది...

Tags:    

Similar News