• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ తో తారక్...

సూపర్ స్టార్ తో తారక్ డబుల్ ఫైట్!

| ఈ ఏడాది ఆగస్ట్ 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2, రజనీ నటించిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన కూలి సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-04-10 09:45 GMT

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ఈ ఏడాది ఆగస్ట్‌లో అసలు క్లాష్‌ను చూడబోతుంది. అది ఏదో చిన్న సినిమాల మధ్య కాదు, దేశంలోని ఇద్దరు మాస్ హీరోలు.. జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ ల మధ్య జరుగబోయే ఢీకొట్టే పోరు. ఈ ఏడాది ఆగస్ట్ 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2, రజనీ నటించిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన కూలి సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది ఇప్పటివరకు ఈ ఏడాది ఫిక్స్ అయిన అతిపెద్ద క్లాష్ అని చెప్పొచ్చు.

వార్ 2 ప్యాచ్ వర్క్ స్టేజిలో ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ చివరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తారక్, హృతిక్ రోషన్ కలిసి పాల్గొనే పాట ఒకటి మిగిలి ఉంది. మరోవైపు కూలి చిత్రానికి షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డబ్బింగ్, ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వీఎఫ్ఎక్స్ పెద్దగా ఉండకపోవడంతో, మిగతా వర్క్ అంతా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఆగస్ట్ మధ్యలో ఈ రెండు బిగ్ బడ్జెట్ చిత్రాలు ఓపెనింగ్స్ లో ఒకదానికొకటి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మరోవైపు కోలీవుడ్ వర్గాల ఊహాగానాల ప్రకారం వచ్చే ఏడాది కూడా రజనీ ఎన్టీఆర్ మరోసారి తలపడే అవకాశం ఉందట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా మూవీ 2026 ఏప్రిల్ 9న రిలీజ్ కావచ్చని సమాచారం.

మరోవైపు రజనీ కాంత్ జైలర్ 2 సినిమా అదే సమయానికి వచ్చే అవకాశం ఉందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారికంగా ఏ అప్డేట్ రాలేదే కానీ, షూటింగ్ కాల్ షీట్‌లు చూస్తే సమాంతరంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జైలర్ 2 దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తర్వాత ఓ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే చేయనున్నాడు. అలాంటి పరిస్థితిలో వీళ్ల మధ్య క్లాష్ జరగాలనే పరిస్థితి రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఏడాది ఆగస్ట్ 14న జరగబోయే వార్ 2 vs కూలి క్లాష్‌కి ఇండస్ట్రీ మొత్తం కన్నేసే ఉంది. ఇది ఓ లెర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ పోరులో ఎవరు నిలబడతారు? ఎవరు ఓపెనింగ్స్ హైరేంజ్‌లో రాబడతారు? అన్నది ఫ్యూచర్ క్లాష్‌లకు రోడ్‌మ్యాప్ అవుతుంది. దాంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌కి రజనీ తారక్ సినిమాలు ఒకే రోజు వస్తాయా అనేది మరింత హాట్ టాపిక్ గా మరే అవకాశం ఉంటుంది.

Tags:    
  • War2vsCoolie 
  • NTRvsRajinikanth 
  • BoxOfficeBattle 
  • PanIndiaClash 
  • War2 
  • Coolie 
  • LokeshKanagaraj 
  • HrithikRoshan 
  • YRFSpyUniverse 
  • JrNTR 
  • Thalaivar 
  • AyanMukerji 
  • Filmindustry 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS