ఢీ అంటే ఢీ: 'వార్ 2' కథేంటో తెలుసా?
తాజాగా అమెరికన్ ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ ఫండగో `వార్ 2` కథాంశాన్ని లీక్ చేసింది.;
భారతీయ సినిమా హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనిపించే కాంబినేషన్‌తో యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న 'వార్ 2' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ కేటగిరీలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సౌత్ సూపర్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కలయికలో అత్యంత భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.
'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ ఒకరికొకరు ఎదురు పడితే నువ్వా నేనా? అంటూ బాహాబాహీకి దిగుతారని, నెవ్వర్ బిఫోర్ అనిపించే ట్రీట్ అభిమానులకు అందిస్తున్నామని ఊరించారు తప్ప అసలు ఈ సినిమా కథాంశం ఏమిటన్నది ఇంతవరకూ లీక్ చేయలేదు.
తాజాగా అమెరికన్ ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ ఫండగో 'వార్ 2' కథాంశాన్ని లీక్ చేసింది. భారతదేశానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ఏజెంట్ కబీర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నియమితుడైన ఏజెంట్ విక్రమ్ స్టోరి ఏమిటన్నదే ఈ సినిమా. విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించాడు. ఏజెంట్ కబీర్ తో సమాన హోదా ఉన్న ఆఫీసర్ విక్రమ్. పరిస్థితులు అదుపుతప్పుతున్న క్రమంలో భారత స్పై ఏజెన్సీ అతడిని రంగంలోకి దించుతుంది. అతడు తన క్రూరమైన, రాక్షసత్వంతో కూడుకున్న టీమ్ తో ఆపరేషన్ లోకి దిగుతాడు. అదే క్రమంలో కబీర్ వర్సెస్ విక్రమ్ ఎపిసోడ్స్ ఎలుకా పిల్లి ఆట ఏమిటన్నది తెరపై చూడాల్సిందేనని సదరు వెబ్ సైట్ కథను లీక్ చేఇసంది. ఛేజ్‌లు, స్టంట్స్ తో పాటు రక్తపాతం భీభత్స వాతావరణం తెరపై ఆవిష్కృతమైందని చెబుతున్నారు. యుద్ధ భూమిలో అత్యంత క్రూరమైనవాడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విరుచుకుపడుతుంటాడు. అతడిని చూస్తే టెర్మినేటర్ గుర్తుకు వస్తాడు! అంటూ ఫండగో తన కథనంలో వెల్లడించింది. మొత్తానికి వార్ 2లో హృతిక్ ని ఢీకొట్టే ధీటైన వాడిగా తారక్ ని అభిమానులు చూడబోతున్నారని ఈ కథనం రివీల్ చేసింది. వార్ 2 ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలవుతోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా ఇది రూపొందుతోంది.