వార్ 2 - ఆ సీన్స్ ను కట్ చేశారా?

దీంతో మేకర్స్ రెస్పాండ్ అయ్యి మేకింగ్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఒరిజినల్ గా తీసినవేనని తెలిపారు. సీన్ కోసం కియారా ఎలా సన్నద్ధమైందో చెప్పారు.;

Update: 2025-08-10 08:19 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో వార్-2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు.

భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న వార్-2 మూవీ.. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమాలో కియారా బికినీ లో కనిపించనుంది. అందుకు సంబంధించిన విజువల్స్ ను గ్లింప్స్ లో మేకర్స్ చూపించగా.. ఓ రేంజ్ లో యూత్ అంతా అట్రాక్ట్ అయ్యారు.

ఇంతకముందు అనేక మంది హీరోయిన్స్ బికినీ వేసుకున్నా.. కియారా మాత్రం వేరే లెవెల్ అని అభిమానులు కొనియాడారు. అదే సమయంలో కొందరు మాత్రం.. కియారా బికినీ సీన్స్ సీజీఐతో క్రియేట్ చేసినవంటూ ఆరోపించారు. అందుకే అంత అందంగా వచ్చాయని నెట్టింట ఊహాగానాలు స్ప్రెడ్ చేశారు.

దీంతో మేకర్స్ రెస్పాండ్ అయ్యి మేకింగ్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఒరిజినల్ గా తీసినవేనని తెలిపారు. సీన్ కోసం కియారా ఎలా సన్నద్ధమైందో చెప్పారు. అయితే కియారా.. ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఆ షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందుకోసం కఠినమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించిందని టాక్ వినిపిస్తోంది.

అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC).. కియారా అద్వానీ బికినీ సీన్స్ ను 50 శాతం తగ్గించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మొదట 18 సెకన్లు ఉన్న ఆ షాట్‌ ను ఇప్పుడు కేవలం 9 సెకన్లకు తగ్గించినట్లు సమచారం. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుల్ గా చక్కర్లు కొడుతోంది.

ఆవన్ జావన్ పాటలోని కియారా అద్వానీ బికినీ సీన్‌ కు సెన్సార్ బోర్డ్ కత్తెర విధించినట్లు తెలుస్తోంది. 9 సెకన్ల సెన్సువల్ విజువల్స్ ను తగ్గించాలని తీసేయాలని చెప్పినట్లు ఉన్నారని సమాచారం. దీంతో ఇది ఆమె ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక బికినీ సీన్స్.. ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News