సూర్య 'తెలుగు' ప్లాన్.. ఫుల్ క్లియర్!
టాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకోవాలని కోలీవుడ్ హీరో సూర్య గట్టిగా ట్రై చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
టాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకోవాలని కోలీవుడ్ హీరో సూర్య గట్టిగా ట్రై చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకులతో స్టోరీ డిస్కషన్స్ జరిపినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడితో వర్క్ చేయనున్నారని టాక్.
సూర్యకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందాయి. 'గజిని', 'సింగం', '24', 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇన్నాళ్లూ ఆయన ఎక్కువగా తమిళ సినిమాల ద్వారానే ఇక్కడి ప్రేక్షకులను పలకరించారు. తెలుగు దర్శకులతో సినిమాలు చేసిన సందర్భాలు తక్కువే.
ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చుకోవాలనే ఆలోచనలో సూర్య ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగు దర్శకుల కథల్లోని కొత్తదనం, ఇక్కడి ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గ స్టోరీలు ఆయనకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేయడంతో పాటు, డైరెక్ట్ గా తెలుగు దర్శకులతో సినిమాలు చేయడంపై కూడా ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పలువురు దర్శకులు సూర్యకు కథలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. 'సరిపోదా శనివారం' ఫేమ్ వివేక్ ఆత్రేయతో సూర్య సినిమా ఉంటుందనే చర్చ కొంతకాలంగా వినిపిస్తోంది. ఆ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. అలాగే 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సన, 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ కూడా సూర్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
బోయపాటి శ్రీను, చందు మొండేటి పేర్లు కూడా గతంలో వినిపించాయి. అయితే ఆ కాంబినేషన్లలో ఏవి ఫిక్స్ అయ్యాయన్నది తెలియదు. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడితో సూర్య చేతులు కలపబోతున్నారనే ప్రచారం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ సినిమా చాలా భారీ స్థాయిలో ఉండబోతోందనే సమాచారం అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయం బయటకు రాలేదు.
సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సరైన కథ, దర్శకుడు కుదిరితే ఇక్కడ ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే తెలుగు దర్శకులతో వరుస సినిమాలు చేయాలనే ఆలోచన ఆయనకు యూజ్ అవ్వచ్చు. అయితే పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకోవడం మెయిన్. ఆ విషయంలో సూర్య ప్లాన్ ఇప్పుడు క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆయనతో సినిమా చేయబోయే తెలుగు డైరెక్టర్ ఎవరనేది చూడాలి.