రామాయణ: 'యష్' శివతాండవం.. DSP సర్ ప్రైజ్

మోస్ట్ ప్రెస్టీజియస్ రామాయణ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా.. రావణుడిగా యష్ ఎలా కనిపిస్తాడనే ఇంట్రెస్ట్ మొదటి నుంచీ ఆడియన్స్ లో ఉంది.

Update: 2026-10-21 04:50 GMT

మోస్ట్ ప్రెస్టీజియస్ రామాయణ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా.. రావణుడిగా యష్ ఎలా కనిపిస్తాడనే ఇంట్రెస్ట్ మొదటి నుంచీ ఆడియన్స్ లో ఉంది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజైన రావణ తాండవం సాంగ్ ఆ ఇంట్రెస్ట్ ను మరింత పెంచుతోంది. ఇందులో యష్ కనిపించిన తీరు, ఆయన ఎక్స్ప్రెషన్స్, పవర్‌ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నులస్తోంది. ముఖ్యంగా శివుడిని ఆరాధిస్తూ రావణుడు చేసే తాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పుడు రావణ తాండవం పాట మరోసారి సినిమా గురించి డిబేట్ జరిగేలా చేయగా, సినిమాలో రావణుడి అప్పీయరెన్స్ ను, అతడిలోని శక్తిని, శివుడిపై భక్తిని చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.

త్రిశూలం, డమరుకంతో కనిపించిన యష్ ఫేస్ లో కోపం, కళ్లలోని ఇంటెన్సిటీ, డ్యాన్స్ లో స్పీడ్ రావణుడి రోల్ పై అంచనాలు పెంచాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. యష్‌ కు ఇప్పటికే ‘కేజీఎఫ్’ సినిమాలతో భారీ మాస్ ఇమేజ్ ఉంది. ఆయన స్క్రీన్ పై కనిపించే విధానం, ఎక్స్ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు రావణుడి పాత్రలో కూడా అలాంటి పవర్‌ ఫుల్ అప్పీయరెన్స్ ను చూపించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

అయితే రావణుడు కేవలం విలన్ గానే కాకుండా గొప్ప శివభక్తుడిగా కూడా ఇతిహాసంలో కనిపిస్తాడు. ఆ రెండు యాంగిల్స్ ను ఇప్పుడు రామాయణ సినిమాలో దర్శకుడు ఎలా చూపిస్తారనేది చూడాలి. ఇక ఆ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌ ను దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. సాంగ్ స్పీడ్ కు, యష్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కు ఆయన గొంతు సరిపోయేలా ఉంది.

దేవిశ్రీ ప్రసాద్ గానంలోని ఎనర్జీ సాంగ్ కు కావాల్సిన స్త్రెంత్ ను తీసుకొచ్చిందని చెప్పాలి. సినిమాకు హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మెర్ కూడా సంగీతం అందిస్తున్నారు. హిందీ వెర్షన్‌ ను విశాల్ దడ్లానీ ఆలపించగా, తమిళంలో అనిరుధ్ రవిచందర్, జీవీ ప్రకాష్ కుమార్ కలిసి పాడారు. పాటలోని విజువల్స్, భారీ సెట్లు, గ్రాఫిక్స్ సినిమా స్థాయిని చూపించేలా ఉన్నాయి. అయితే ఇలాంటి భారీ చిత్రాలకు కేవలం విజువల్స్ మాత్రమే సరిపోవు.

మూవీ స్టోరీ, టేకింగ్ క్యారక్టరైజేఎషన్, సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అయితే విజువల్స్ కథలో ఎంత నేచురల్ గా కలుస్తాయి, రావణుడి పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. అదే సమంలో రామాయణ ఫస్ట్ పార్ట్ నవంబర్ 5న విడుదల కానుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులకు అందించాలనే టార్గెట్ తో భారీ బడ్జెట్‌ తో నమిత్ మల్హోత్రా, యష్ రూపొందిస్తున్నారు.




Tags:    

Similar News