విజయ్ నాకు ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు -రష్మిక
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం మహిళలకు నల్లపూసలు ఎంత ప్రత్యేకమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం మహిళలకు నల్లపూసలు ఎంత ప్రత్యేకమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యముగా వివాహమైన ప్రతి మహిళ భాషతో సంబంధం లేకుండా మతంతో పట్టింపు లేకుండా ఖచ్చితంగా నల్లపూసలు ధరించాల్సిందే . ఈ నల్లపూసలు పెళ్లయిన మహిళకు ప్రతీక అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి నల్లపూసలను తన భర్త విజయ్ దేవరకొండ తనకు ఇంకా కొనివ్వలేదు అంటూ రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీత గోవిందం సినిమా సమయంలో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక వివాహం తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం రణబాలి. బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక మందన్న తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. నిజ జీవిత భార్యాభర్తలు తెరపై కూడా అంతే అద్భుతంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ఇక ఈ జంట తెరవరకే పరిమితం కాకుండా ప్రజలతో మమేకమవుతు అభిమానులను కలుస్తూ ఎన్నో ముచ్చట్లు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ సాంప్రదాయ వేడుక అయిన బతుకమ్మ పండుగను అభిమానుల మధ్య జరుపుకున్న ఈ జంట దసరా సందర్భంగా తమ సినిమా షూటింగ్ సెట్ సింగనమల కు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా అభిమానులతో మీట్ అయి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఒక అభిమాని విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ.. రణబాలి సినిమాలో నల్లపూసలు ఇవ్వలేకపోయారు. బయట వదినమ్మకు ఇచ్చారా ?అని ప్రశ్నించారు. దానికి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించిన చాలా జ్యువెలరీ సెట్లన్నీ నేనే ఇచ్చాను అని విజయ్ చెబుతుంటే ..ఆ అభిమాని మాత్రం అలా జువెలరీ సెట్లు కాదు నల్లపూసలు ప్రత్యేకమైనవి కదా.. అదొక సపరేట్ ఎమోషన్ కదా అని అడిగారు.
విజయ్ దేవరకొండ తడబడుతుండగా .. రష్మిక మందన్న మైకు తీసుకొని.. అంటే వివాహం జరిగిన వెంటనే మా అత్తయ్య ఇచ్చారు. మా అమ్మాయి ఇచ్చారు. మన సైడు లేడీస్ చాలా స్ట్రాంగ్. పెళ్లి అవ్వగానే మెడలో ఇంకా పసుపు తాడు ఉండగానే నాకు నల్లపూసలు తెచ్చి ఇచ్చారు. కానీ విజయ్ దేవరకొండ నల్లపూసలకు నేనింకా వెయిటింగ్ అంటూ తన భర్త తనకి ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు అంటూ చెప్పి అందరిని నవ్వించింది రష్మిక మందన్న. మొత్తానికైతే తన భర్త తనకి ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు అంటూ చేసిన ఈ క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.