మెగాస్టార్ ముందు ఛాన్స్ ఎవరికి..?
మెగాస్టార్ చిరంజీవి ముందు శ్రీకాంత్ ఓదెలతో సినిమా స్టార్ట్ చేస్తారా లేదా బాబీతో అన్నది తెలియాల్సి ఉంది.;
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వెనక్కి వెళ్లి అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా ముందొచ్చింది. విశ్వంభర వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసం కొంత టైం పట్టేలా ఉందని ఆ సినిమా రిలీజ్ ని నెక్స్ట్ సమ్మర్ షిఫ్ట్ చేశారు. సో 2026 సంక్రాంతికి మెగా 157గా అనుకున్న ప్రాజెక్ట్ ముందు రాబోతుంది. సంక్రాంతికి అనిల్ సినిమా అంటే పక్కా హిట్ అనేలా ఉంది. సో ఈసారి సంక్రాంతికి కూడా అనిల్ ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.
విశ్వంభర తర్వాతే చిరంజీవి..
విశ్వంభర తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా.. బాబీ తో మరో సినిమా లాక్ చేసుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాతే చిరు సినిమా ఉంటుంది. ఐతే విశ్వంభర రిలీజ్ తర్వాతే చిరంజీవి నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఐతే మెగా 158, 159 సినిమాల్లో ఏది ముందు ఏది వెనక అన్నది క్లారిటీ లేదు.
మెగాస్టార్ చిరంజీవి ముందు శ్రీకాంత్ ఓదెలతో సినిమా స్టార్ట్ చేస్తారా లేదా బాబీతో అన్నది తెలియాల్సి ఉంది. కె.ఎస్ బాబీ ఆల్రెడీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందించినా మెగాస్టార్ కి మరో బ్లాక్ బస్టర్ కోసం కృషి చేస్తున్నాడు బాబీ. మెగా అభిమానిగా బాబీ ఈసారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.
చిరంజీవి కూడా డబుల్ షిఫ్ట్ లో..
శ్రీకాంత్ ఓదెల, బాబీ ఈ ఇద్దరి సినిమాలు కూడా ఒకేసారి సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి కూడా డబుల్ షిఫ్ట్ లో పనిచేస్తారని చెప్పొచ్చు. విశ్వంభర నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ కాబట్టి ఈ సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి వరకు జరిగితే విశ్వంభర రిలీజ్ తర్వాత ఈ రెండు సినిమా షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంటుంది.
మెగాస్టార్ మాత్రం రాబోతున్న సినిమాల మీద చాలా ఆసక్తిగా ఉన్నారట. ముఖ్యంగా కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెల లాంటి యువ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. దసరా, ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ థర్డ్ మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి. సో ఈ వరుస సినిమాలు మెగా ఫ్యాన్స్ కి మెగా ఫీస్ట్ అందిస్తాయని చెప్పొచ్చు.