• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మెకానిక్ రాకీ' స్టోరీ...

'మెకానిక్ రాకీ' స్టోరీ లైన్.. విశ్వక్ సెలక్షన్ కేక!

| ఖాజాగూడ ప్రాంతంలోని ఆర్కే గ్యారేజ్‌లో ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్‌ లో మెకానిక్ రాకీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్టోరీ లైన్ ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-02-26 15:05 GMT

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. అవకాశాలు రావడం మామూలే.. కానీ ఎలాంటి కథలను సెలక్ట్ చేసుకుంటామన్నదే ఇంపార్టెంట్ అన్న విధంగా తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు విశ్వక్. ప్రతి సినిమాలో ఓ కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. త్వరలో అడ్వెంచర్ థ్రిల్లర్ గామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గామి మూవీలో అఘోర శంకర్ గా కనిపించబోతున్నారు విశ్వక్. మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అఘోరగా నటిస్తున్నారు. మార్చి 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాబోతుంది. పీరియాడిక్ పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

విశ్వక్ లైనప్ లో ఉన్న మరో మూవీ కల్ట్. అయితే ఈ సినిమాకు కథ అందించి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ నటించడం లేదు. ఈ మూవీ ఓ డిఫరెంట్ డ్రగ్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుందని టాక్. ఇటీవల విశ్వక్ ప్రకటించిన మరో చిత్రం లైలా. స్వీయ డైరెక్షన్ లో విశ్వక్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో లైలా పాత్రను విశ్వకే పోషిస్తున్నారు.

వీటన్నింటితోపాటు విశ్వక్ లైనప్ లో మెకానిక్ రాకీ మూవీ కూడా ఉంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీతో దర్శకుడు రవితేజ ముళ్లపాడి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఖాజాగూడ ప్రాంతంలోని ఆర్కే గ్యారేజ్‌లో ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్‌ లో మెకానిక్ రాకీ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్టోరీ లైన్ ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఫేక్ యాక్సిడెంటల్, మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను క్యాష్ చేసుకునే వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

What is your opinion on giving 24 seats to Jana Sena as part of alliance with TDP?#TDPJanasena #TDPJSPTogether #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 26, 2024
Tags:    
  • Vishwaksen 
  • Tollywood 
  • Actor 
  • Mechanicrocky 
  • Gangsofgodavari 
  • Gaami 
  • Adventurethriller 
  • Shraddhasrinath 
  • Meenakshichaudhry 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS