విశ్వక్ సైలెంట్ గా మరొకటి స్టార్ట్ చేశారా?

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చూస్తే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2025-12-13 20:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చూస్తే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే కెరీర్ లో పలు హిట్స్ అందుకున్న విశ్వక్.. రీసెంట్ గా వరుస సినిమాలతో అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు.

యాక్టింగ్ తో సినీ ప్రియులను, అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం హిట్స్ అందుకోలేకపోయారు. ఇప్పుడు భారీ విజయాలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు గాను వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫంకీ మూవీని కంప్లీట్ చేస్తున్నారు విశ్వక్ సేన్.

ఇప్పుడు ఫంకీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న మాస్ కా దాస్.. కొత్త కథలు కూడా వింటున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా లెగసీ అనే టైటిల్ తో రూపొందనున్న సినిమాకు ఓకే చెప్పినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ డ్రామాగా రానున్న ఆ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారని ప్రచారం జరుగుతోంది.

ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకపోయినా.. అవుట్ పుట్ బాగా వచ్చేందుకు షూటింగ్ పై మొత్తం ఫోకస్ చేశారని సమాచారం. అయితే లెగసీ మూవీకి సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారని, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పొలిటికల్ జోనర్ లో స్ట్రాంగ్ స్టోరీతో సినిమాను రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే సాయి కిరణ్.. ఇప్పటికే హారర్ ఎంటర్టైనర్ పిండం మూవీ తీశారు. ఆ సినిమా అనుకున్నట్లు స్థాయిలో అలరించలేదు. డెబ్యూ మూవీతో నిరాశపరిచినా.. ఇప్పుడు లెగసీ చిత్రం కోసం మంచి కథను సిద్ధం చేశారని వినికిడి. అందుకే కంప్లీట్ స్టోరీ నెరేషన్ విన్నాక ఫిదా అయినా విశ్వక్ సేన్.. సాయి కిరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి కిరణ్ కు మంచి ఛాన్స్ దొరికిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డెబ్యూతో ఆకట్టుకోకపోయినా.. మాస్ కా దాస్ తో సినిమా తీసే అవకాశం అందుకున్నారని అంటున్నారు. మరి ఇప్పుడు డైరెక్టర్ సాయి కిరణ్.. లెగసీ మూవీని ఎలా రూపొందిస్తున్నారో.. విశ్వక్ సేన్ కు ఎలాంటి హిట్ దక్కేలా చూస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News