రవితేజ కథతోనే ఫంకీ..?
ఒక హీరోకి అనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల మరో హీరో దగ్గరకి వెళ్తుంది. కథ నచ్చినా కూడా కమిటైన సినిమాల వల్ల ఆ సినిమాలు చేయడం కుదరదు.;
ఒక హీరోకి అనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల మరో హీరో దగ్గరకి వెళ్తుంది. కథ నచ్చినా కూడా కమిటైన సినిమాల వల్ల ఆ సినిమాలు చేయడం కుదరదు. అలా కొన్ని మిస్సైన సినిమాలు సక్సెస్ అయితే ఆ మూవీ చేయాల్సిందని హీరోలు ఫీల్ అవుతుంటారు. అలా జరిగిన సినిమాలు.. జరుగుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఐతే లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ చేయాల్సిన ఒక సినిమా ఆయన చేయడం కుదరక మరో హీరో దగ్గరకి వెళ్లిందని టాక్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్..
రవితేజ దగ్గర నుంచి మరో మాస్ హీరో దగ్గరకి వెళ్లిందట. ఆ హీరో ఆ సినిమా పట్టాలెక్కించడం కూడా జరిగింది. ఇంతకీ ఎవారా హీరో ఏంటా సినిమా అంటే ఆ హీరో విశ్వక్ సేన్.. ఆ సినిమా ఫంకీ అని తెలుస్తుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అనుదీప్ కెవి కాంబోలో వస్తున్న సినిమా ఫంకీ. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహార్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే ఈ సినిమా కథను ముందు అనుదీప్ రవితేజతో చేయాలని అనుకున్నాడట. రవితేజకి కథ నచ్చినా కూడా సినిమాకు కాస్త టైం పడుతుందని వదిలేశాడట. ఐతే రవితేజ ఓకే చేశాడని తెలిసి విశ్వక్ సేన్ కథ వినగానే లాక్ చేశాడు. అలా విశ్వక్ సేన్, అనుదీప్ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ కూడా కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. చేస్తున్న సినిమాలు రిలీజ్ ముందు బజ్ బాగున్నా రిలీజ్ తర్వాత తేలిపోతున్నాయి.
ఫ్యాన్స్ సాటిస్ఫై చేసే యాక్షన్ సీన్స్ ..
అందుకే ఒక సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. విశ్వక్ సేన్ ఫంకీ అటు అనుదీప్ మార్క్ కామెడీ తో ఉంటూనే మాస్ కా దాస్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ప్రిన్స్ తర్వాత అనుదీప్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. విశ్వక్ సేన్ తో అనుదీప్ సినిమా అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.
జాతిరత్నాలు డైరెక్టర్ చేస్తున్న ఈ మాస్ అటెంప్ట్ ఏమేరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందో చూడాలి. విశ్వక్ సేన్ మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడట. డ్రాగన్ తో హిట్ కొట్టిన కయదు లోహర్ కూడా ఫంకీకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. మరి ఈ ఫంకీ బాయ్ ఏం చేస్తాడన్నది చూడాలి.