రాయణం మరో కొత్త ప్రయోగం..!

ఈ సరికొత్త క్రైమ్‌ కామెడీ చిత్రం ఏసీఈ ను తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2024-05-18 04:17 GMT

తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నా కూడా విలక్షణంగా ఉండాలనే ఉద్దేశ్యంతో విలన్‌ పాత్రలను మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా స్టార్‌ నటుడు అంటూ విజయ్ సేతుపతి ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

అన్ని భాషల్లో కూడా విజయ్‌ సేతుపతి నటనకు, ఆయన పాత్రలకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విజయ్ సేతుపతి త్వరలో 'ఏసీఈ' అనే విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఉప్పెన సినిమాలో రాయణం పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సరికొత్త క్రైమ్‌ కామెడీ చిత్రం ఏసీఈ ను తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరుముగ కుమార్‌ దర్శకత్వంలో విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్‌ కమెడియన్‌ యోగి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ ఇలా ఎంతో మంది ప్రముఖ నటీనటులు విజయ్ సేతుపతి తో కలిసి సందడి చేయబోతున్నారు.

Read more!

బాలీవుడ్‌ లో కత్రీనా కైఫ్‌ తో కలిసి మేరీ క్రిస్మస్‌ సినిమాను చేసి ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ సేతుపతి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయాడు. అయితే తన మార్క్‌ వినోదాన్ని మాత్రం విజయ్‌ సేతుపతి అందించాడు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెరైటీ టైటిల్‌ తో పాటు చాలా వెరైటీగా ఉండి ప్రేక్షకులను అలరించే విధంగా క్రైమ్‌ కామెడీని తీసుకుని ఆరుముగ కుమార్‌ తీసిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని, ఈ కొత్త ప్రయోగం భాష తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. మరి ఉప్పెన రాయణం చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి.

Full View
Tags:    

Similar News