తెలంగాణ వ్య‌క్తిత్వంపై స్టార్ రైట‌ర్ స్టోరీ!

తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. అయితే వాటి రిలీజ్ ల‌కు స‌రైన ప్రోత్సాహం లేక‌పోవ‌డంతో ఆ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రీచ్ అవ్వేల‌దు.;

Update: 2025-07-03 14:30 GMT

తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. అయితే వాటి రిలీజ్ ల‌కు స‌రైన ప్రోత్సాహం లేక‌పోవ‌డంతో ఆ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రీచ్ అవ్వేల‌దు. ఎంత గొప్ప సినిమా తీసినా? స‌రైన థియేట‌ర్లు దొర‌క‌క‌పోతే ఆ సినిమా కిల్ అయిన‌ట్లే. అలా తెలంగాణ సినిమా కిల్ అయిం ద‌న్న‌ది కొంత వాస్త‌వం. వేణు తెర‌కెక్కించిన  'బ‌లగం' సినిమా అంత పెద్ద స‌క్సెస్ సాధించిందంటే కార‌ణం కంటెంట్ తో పాటు దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ రిలీజ్ చేయ‌డంతోనే సాధ్య‌మైంది.

త్వ‌ర‌లో ఇదే కాంబినేష‌న్ లో `ఎల్ల‌మ్మ` కూడా రాబోతుంది. ఇందులో యూత్ స్టార్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈసినిమాతో తెలంగాణ నేప‌థ్యం ఎలా ఉంటుంది? అన్న‌ది కొంత‌వ‌ర‌కూ ప్రేక్ష‌కుల‌కు తెలిసే అవ‌కాశం ఉంది. అయితే వీట‌న్నింటికి భిన్నంగా తెలంగాణ మ‌నుషులు ఎంత గొప్ప వాళ్లు? అన్న‌ది హైలైట్ చేస్తూ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓ స్టోరీ రాయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తాడా? మ‌రో ద‌ర్శ‌కుడు చేస్తాడా? విజ‌యేంద్రుడే బ‌రిలోకి దిగుతారా? అన్న‌ది క్లారిటీ లేదు కానీ అక్క‌డ మ‌నుషులు, మ‌న‌స్త‌త్వాలు, వ్య‌క్తిత్వాల‌ను ఆధారంగా చేసుకుని గొప్ప క‌థ‌ను రాస్తాన‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు. ఇక్క‌డే తెలంగాణ‌-ఆంధ్ర మ‌నుషుల మ‌ధ్య సారూప్య‌త‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. ఎవ‌రైనా కొత్త వాళ్లు తెలియ‌ని వాళ్లు వ‌స్తే ఆంధ్రా ప్ర‌జ‌లు సోష‌ల్ స్టేట‌స్ గురించి వివ‌రాలు ఆరా తీస్తారు.

కానీ తెలంగాణ మ‌నుషులు మాత్రం ఛాయ్ తాగుతావా? ఎట్లా ఉన్నావ్? అని ఎవ‌రో పూర్తిగా తెలియ‌క‌పో యినా అడుగుతార‌ని అదే వాళ్ల గొప్ప‌త‌న‌మ‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ అభిప్రాయ ప‌డ్డారు. అందుకే తెలంగాణ నేప‌థ్యంపై త‌ప్ప‌కుండా స్టోరీ రాస్తాన‌న‌నారు. వాళ్ల నేప‌థ్యం నుంచి భిన్న‌మైన క‌థ‌లు ఎన్నో రాయ డానికి అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags:    

Similar News