విజయ్ వర్సెస్ విజయ్.. నిజంగా జరిగితే..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో రౌడీ జనార్ధన్ సినిమా సెట్స్ మీద ఉంది.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో రౌడీ జనార్ధన్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఐతే విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారు అన్నది ఇప్పటివరకు సీక్రెట్ గా ఉంచారు. లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం క్రేజీ స్టార్ విజయ్ కి విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ లో మరో విజయ్ విలన్ గా చేస్తున్నారట.
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్..
అతనెవరో కాదు కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అని తెలుస్తుంది. ఓ పక్క లీడ్ రోల్ లో సినిమాలు చేస్తూ కొత్త కథలతో వస్తున్న విజయ్ సేతుపతి మరోపక్క మంచి క్యారెక్టర్ సినిమాను టర్న్ చేసే రోల్స్ కి రెడీ అంటున్నారు. ఐతే విలన్ గా చేస్తూ రావడం వల్ల తనని ఫుల్ టైం విలన్ గా చేసేస్తారన్న ఆలోచనతో లీడ్ రోల్ సినిమాలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. ఐతే ఈసారి విజయ్ దేవరకొండ కోసం విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడట.
రాయలసీమ కథతో లవ్ అండ్ యాక్షన్ మూవీగా రౌడీ జనార్ధన్ వస్తుంది. పేరులోనే రౌడీ అని పెట్టారు కాబట్టి విజయ్ దేవరకొండ మాస్ చూపించబోతున్నారని తెలుస్తుంది. ఐతే విజయ్ వర్సెస్ విజయ్ ఈ ఫైట్ మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. విజయ్ సేతుపతి నటించడం వల్ల తమిళ్ లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో విజయ్ సేతుపతి ఇటు సినిమా మార్కెట్ కి కూడా ఉపయోగపడుతున్నాడు.
కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ..
కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ రౌడీ జనార్ధన్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దిల్ రాజు కూడా ఈ సినిమాను చాలా గ్రాండియర్ గా రూపొందిస్తున్నారని తెలుస్తుంది. 2026 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో రాబోతున్న రౌడీ జనార్ధన్ విజయ్ స్క్వేర్ హంగామా తెర మీద ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.
ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ తో మరో సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రౌడీ జనార్ధన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుండగా VD 14లో రష్మిక మందన్న జతకడుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.