మొదటిసారి ఇలా.. వీడియోతో సర్ ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ..!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన ఇన్ స్టా లో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో షేర్ చేశాడు.;
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన ఇన్ స్టా లో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో షేర్ చేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైం రెండు సినిమాలు ఒకేసారి పార్లర్ గా చేస్తున్నానని.. దాని కోసం చాలా కష్టపడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన కొత్త రోలెక్స్ వాచ్.. తన రౌడీ వేర్ కొత్త ప్రొడక్ట్స్ తో పాటు రోజు పూజ చేస్తానని చెప్పాడు. ఓ విధంగా తన ఫ్యాన్స్ కి ఈ వీడియోతో ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
రౌడీ వేర్ కొత్త స్టైల్ తో విజయ్ దేవరకొండ..
అతను రౌడీ వేర్ స్టైల్ చూపించిన టైం లో వెనక రష్మిక వాయిస్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి రౌడీ వేర్ కొత్త స్టైల్ తో పాటు విజయ్ దేవరకొండ తన దగ్గర ఉన్న కలెక్షన్స్ తో ఇలా తన ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ఇక విజయ్ దేవరకొండ చెప్పిన రెండు సినిమాల గురించి చూస్తే.. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తున్న రౌడీ జనార్ధన్ కాగా.. రెండోది రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా.
వీడీ, రాహుల్ కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా కింగ్ డం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సినిమాకు టాక్ మిశ్రమంగా వచ్చిన ఫైనల్ రిజక్ట్ డిజప్పాయింట్ చేసింది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రౌడీ జనార్ధన్..
ఇక రాబోతున్న రౌడీ జనార్ధన్ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ తో మహానటి సినిమాలో నటించాడు విజయ్. ఐతే కీర్తితో ఆ సినిమాలో కలిసి చేసిన సీన్స్ పడలేదు. ఐతే ఈసారి ఈ ఇద్దరు జంటగా రౌడీ జనార్ధన్ వస్తుంది. రౌడీ జనార్ధన్ సినిమా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఐతే రాబోతున్న రెండు సినిమాలు మాత్రం ఒకదాన్ని మించి మరొకటి అనిపించేలా ఉంటాయని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే నెక్స్ట్ విజయ్ సినిమా ప్లానింగ్ ఉంటుంది. ఐతే ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ల మీద విజయ్ దేవరకొండ కూడా చాలా హోప్స్ తో ఉన్నాడు.